అమెరికాలో మార్మోగుతున్న 'పద్మావతి' పాట..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 03:18 PM

అమెరికాలో మార్మోగుతున్న 'పద్మావతి' పాట..

ముంబాయి, జనవరి 31: దీపికా పదుకునే ప్రధాన పాత్రలో నటించిన 'పద్మావతి' చిత్రంలోని 'ఘూమ‌ర్.. ఘూమ‌ర్..' పాట సంచలనం సృష్టించింది. రాజ‌స్థానీ నృత్య క‌ళ‌ను ప్రదర్శించిన ఈ పాట‌లో దీపికా అద్భుతంగా నర్తించింది. ఈ పాట‌కు డ్యాన్స్ చేయ‌డానికి ఉత్తరాది, దక్షిణాది అమ్మాయిలు తెగ ఆసక్తి చూపుతున్నారు.

అయితే ఇప్పుడు ఈ పాట అమెరికాలో మార్మోగుతుంది. అమెరికాలోని నేష‌న‌ల్ బాస్కెట్‌బాల్ అసోసియేష‌న్ నిర్వ‌హించిన పోటీల ప్రారంభ కార్య‌క్ర‌మంలో ఈ పాట‌కు విదేశీ చీర్‌లీడ‌ర్లు నృత్యం చేసి అంద‌రినీ ఆక‌ట్టుకున్నారు. షార్లెట్ హార్నెట్స్‌, మ‌యామీ హీట్ జ‌ట్ల మ‌ధ్య మ్యాచ్ ప్రారంభానికి ముందు ఈ నృత్యాన్ని ప్ర‌ద‌ర్శించారు. ఈ వీడియోను ఎన్‌బీఏ త‌మ అధికారిక ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో హాల్ చల్ చేస్తోంది.

Untitled Document
Advertisements