మరోసారి రవితేజ సరసన కాజల్..

     Written by : smtv Desk | Wed, Jan 31, 2018, 04:19 PM

మరోసారి రవితేజ సరసన కాజల్..

హైదరాబాద్, జనవరి 31: గతేడాది 'రాజాది గ్రేట్' చిత్రంతో ఘన విజయం అందుకున్న మాస్ మహారాజా రవితేజ, వరుస సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు. కల్యాణ్ కృష్ణతో 'నేల టికెట్', శ్రీను వైట్లతో 'అమర్ అక్బర్ అంథోని', చిత్రంలో నటిస్తున్నాడు. ఇందులో 'నేల టికెట్' 25% షూటింగ్ పూర్తయ్యింది.

అయితే సెట్స్ పైకి వెళ్లడానికి రెడీగా ఉన్న శ్రీను వైట్ల సినిమాలో రవితేజ త్రిపాత్రభినయంలో కనిపించబోతున్నాడు. ఒక కథానాయికగా నివేదా థామస్ ను ఎంపిక చేసినట్టుగా సినీ వర్గాల్లో టాక్. మరో కథానాయికగా కాజల్ ను తీసుకున్నారనేది తాజా సమాచారం. గతంలో వీరిద్దరూ కలిసి నటించిన 'సారోచ్చారు', 'వీర' సినిమాలు మంచి విజయాన్ని సాధించాయి. ఏప్రిల్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది.

Untitled Document
Advertisements