ఫిబ్రవరి 5 @ భగీరథ నీరు : వేముల

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 11:34 AM

ఫిబ్రవరి 5 @ భగీరథ నీరు : వేముల

హైదరాబాద్, ఫిబ్రవరి 1 : ప్రతి గ్రామానికి ఫిబ్రవరి 5 నుంచి భగీరథ నీరు అందేలా చూడాలని వైస్‌చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి ఆదేశించారు. సచివాలయం సీ బ్లాక్‌లోని తన కార్యాలయంలో మిషన్ భగీరథ సివిల్, ఎలక్ట్రో మెకానికల్ పనులపై సమీక్ష నిర్వహించిన ప్రశాంత్‌రెడ్డి పనుల పురోగతిపై ఆరా తీశారు. పనులలో అలసత్వం వహిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే బ్లాక్‌లిస్ట్ చేయడానికి సైతం వెనుకాడమన్నారు.

ఫ్లోరైడ్ ప్రభావిత ప్రాంతాలైన దేవరకొండలోని గ్రామాలకు తాగునీటిని అందించే బాట్లపల్లి వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ (డబ్ల్యూటీపీ)లో ఫిబ్రవరి 12న ట్రయల్ రన్ నిర్వహించాలని అధికారులకు సూచించారు. త్వరితగతిన పనులను పూర్తి చేసి ప్రారంభోత్సవాలకు సిద్దం చేయాలన్నారు.

అదే విధంగా సీఎంవో కార్యదర్శి స్మితాసబర్వాల్ మాట్లాడుతూ.. ఎలక్ట్రోమెకానికల్ పనులు చేస్తున్న ఏజెన్సీలు పనులను చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నాయని, పనులను పూర్తి చేయని పక్షంలో ఏజెన్సీల బిల్లులను నిలిపివేస్తామని హెచ్చరించారు. దాదాపు ఎనిమిది గంటలు సాగిన ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారులు, కన్సల్టెంట్లు తదితరులు పాల్గొన్నారు.

Untitled Document
Advertisements