తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు.. 8 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 63 పరుగులు

     Written by : smtv Desk | Tue, Jan 10, 2023, 02:34 PM

తొలి వన్డేలో  తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు.. 8 ఓవర్లలో
వికెట్ నష్టపోకుండా  63 పరుగులు

మూడు వన్డేల సిరీస్ లో భాగంగా గువాహటిలో టీమిండియా, శ్రీలంక జట్ల మధ్య ఈ రోజు మొదటి వన్డే జరుగుతోంది. శ్రీలంక జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు 8 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. శుభ్ మాన్ గిల్ 25, కెప్టెన్ రోహిత్ శర్మ 38 పరుగులతో క్రీజులో ఉన్నారు.
ఈ మ్యాచ్ కోసం టీమిండియా బలమైన జట్టుతో బరిలో దిగింది. రోహిత్ శర్మ, కోహ్లీ, కేఎల్ రాహుల్, మహ్మద్ షమీ, సిరాజ్, అయ్యర్ పునరాగమనం చేశారు. వరల్డ్ కప్ ను దృష్టిలో ఉంచుకుని జట్టు ఎంపికలో జాగ్రత్త పడినట్టు అర్థమవుతోంది. టాస్ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. వరల్డ్ కప్ దిశగా జట్టు సన్నద్ధంగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు.





Untitled Document
Advertisements