హానీట్రాప్​ లో చిక్కుకున్న పాక్ కెప్టెన్ బాబర్.. వైరల్ మారిన ఫోటోలు, వీడియోలు

     Written by : smtv Desk | Tue, Jan 17, 2023, 11:51 AM

హానీట్రాప్​ లో చిక్కుకున్న పాక్ కెప్టెన్ బాబర్.. వైరల్ మారిన ఫోటోలు, వీడియోలు

ఈ మధ్యకాలంలో సామాన్య ప్రజల నుంచి సెలబ్రిటిల వరకు చాలా మంది హనీట్రాప్ వలలో పడుతున్నారు. ఈ వలలో చిక్కుకుని విలవిలలాడి పోతున్నారు. కొంతమంది పరువుకు బయపడి ప్రాణాలు తీసుకుంటుంటే.. మరికొంతమంది మానసికంగా క్రుంగిపోతున్నారు. తాజాగా పాకిస్థాన్ పురుషుల క్రికెట్ జట్టు కెప్టెన్ బాబర్ ఆజమ్ హానీట్రాప్ కు గురైనట్టు తెలుస్తోంది. అతనికి సంబంధించిన పలు ప్రైవేట్ వీడియోలు, ఆడియో రికార్డింగ్స్, ఫొటోలు, మహిళతో చేసిన చాంటింగ్ స్క్రీన్ షాట్లు నెట్ లో ప్రత్యక్షం కావడంతో సంచలనం రేగింది. పాకిస్థాన్ కు చెందిన తోటి క్రికెటర్ ప్రియురాలికి బాబర్ లైంగిక సందేశాలు పంపించాడనే ఆరోపణలు వస్తున్నాయి. తనతో ఇలానే సెక్స్ చాటింగ్ చేస్తుంటే.. నీ ప్రియుడు జట్టు నుంచి ఎప్పటికీ బయటికి వెళ్లడంటూ సదరు మహిళకు బాబర్ హామీ ఇచ్చినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దాంతో, బాబర్ తీరుపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే, వీడియోలు, ఫొటోల్లో ఉన్నది బాబర్ కాదని అతని మద్దతుదారులు చెబుతున్నారు. గిట్టని వాళ్లు మార్ఫింగ్ చేసి వీటిని సోషల్ మీడియాలో షేర్ చేశారని ఆరోపిస్తున్నారు. మరికొందరు బాబర్ నిజంగానే హనీట్రాప్ కు గురై ఉంటాడని భావిస్తున్నారు.తన పై వస్తున్న ఈ ఆరోపణల విషయంగా పాక్ కెప్టెన్ ఇంకా పెదవి విప్పలేదు.
https://twitter.com/niiravmodi/status/1614709104949465088?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1614709104949465088%7Ctwgr%5E73c83ea9b3dd927c97d385aa42e8597d5283705b%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-762470%2Fpakistan-skipper-babar-azam-caught-in-honey-trap





Untitled Document
Advertisements