ఇండియా-అమెరికా స్నేహంకు ఆకాశమే హద్దు: నిక్కి హేలీ

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 05:08 PM

ఇండియా-అమెరికా స్నేహంకు ఆకాశమే హద్దు: నిక్కి హేలీ

వాషింగ్టన్, ఫిబ్రవరి 1‌: ఐరాసలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ ఇండియా- అమెరికా సంబంధాలు బాగా పెరుగుతుండడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చాలా ఇష్టపడుతున్నారని స్పష్టంచేశారు. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలకు ఆకాశమే హద్దు అని ఆమె తెలిపారు. భారత్‌ మోదీ నేతృత్వంలో శక్తివంతమైన ఆర్థిక, సంస్థాగత సంస్కరణలతో దూసుకుపోతుందని ప్రశంసలు కురిపించారు.

అమెరికాలో భారత రాయబారి నవ్‌తేజ్‌ సింగ్‌ సర్నా తన నివాసంలో ఏర్పాటు చేసిన విందులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.." భారత్-అమెరికా మధ్య స్నేహంకు ఆకాశమే హద్దు. ఇరు ప్రజాస్వామ్య దేశాలకు చాలా విషయాల్లో ఒకేరకమైన విలవలున్నాయి. ఇరు దేశాల సత్సంబంధాలు పెరగుతుండడం పట్ల ట్రంప్‌కు సంతోషంగా ఉంది" అని వ్యాఖ్యానించారు.

Untitled Document
Advertisements