సవాల్ కు "సై" అంటున్న ఉత్తమ్ కుమార్..

     Written by : smtv Desk | Thu, Feb 01, 2018, 06:16 PM

సవాల్ కు

హైదరాబాద్, ఫిబ్రవరి 1 : ఐటీ శాఖల మంత్రి కేటీఆర్.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్‌కు 70 సీట్లు వస్తే రాజకీయ సన్యాసం తీసుకుంటానని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ కు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ సవాల్ ను స్వీకరిస్తున్నట్లు ఉత్తమ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ సవాల్ స్వీకరిస్తున్నానని వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రాకపోతే తన కుటుంబం రాజకీయాల నుండి తప్పుకుంటుందని స్పష్టం చేశారు. ఇదే నిబంధన కేసీఆర్, కేటీఆర్ కుటుంబానికి సైతం వర్తిస్తుందని పేర్కొన్నారు.

Untitled Document
Advertisements