నేడు అతియాను పెళ్లాడబోతున్న కేఎల్ రాహుల్.. 100 మంది అతిథులకు ఆహ్వానం

     Written by : smtv Desk | Mon, Jan 23, 2023, 10:58 AM

నేడు అతియాను పెళ్లాడబోతున్న కేఎల్ రాహుల్.. 100 మంది అతిథులకు ఆహ్వానం

సినిమా స్టార్స్ క్రికెటర్స్ మధ్య లవ్ ఎఫైర్స్, పెళ్ళిళ్ళు అనేవి సర్వసాధారణం.. బాలీవుడు నటుడు సునీల్ శెట్టి కుమార్తె అతియా శెట్టిని స్టార్ క్రికెటర్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ పెళ్లాడబోతున్నాడు. వీరి పెళ్లి పుణెకు సమీపంలోని కండాలాలో ఉన్న సునీల్ శెట్టి ఫామ్ హౌస్ లో నేడు జరగనుంది. కేవలం 100 మంది అతిథులకు వివాహ ఆహ్వానం పంపినట్టు తెలుస్తోంది. వివాహం తర్వాత ముంబైలో ప్రముఖుల కోసం రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నారు. కత్రినాకైఫ్, విక్కీ కౌశల్ వివాహం మాదిరే ఫోన్ వినియోగించడానికి అనుమతించరు.
బాలీవుడ్ పరిశ్రమకు చెందిన నటులు, వ్యాపారవేత్తలు, క్రికెటర్లు ఇలా సుమారు 3,000 అతిథులను వెడ్డింగ్ రిసెప్షన్ కు ఆహ్వానించనున్నారు. టైగర్ ష్రాఫ్ సోదరి కృష్ణ ష్రాఫ్, బాలీవుడ్ ఫొటోగ్రాఫర్ రోహన్ శ్రేష్ట పెళ్లిని షూట్ చేయనున్నారు. ముఖ్యంగా వీరి వివాహానికి వచ్చే అతిథులకు దక్షిణాది వంటకాలను వడ్డించనున్నారు. అది కూడా అరిటాకులపైనే భోజనం ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు వీరి వివాహం జరగనుంది. బెంగళూరులోనూ వివాహ రిసెప్షన్ ఏర్పాటు చేయనున్నట్టు తెలుస్తోంది. వీరి వివాహానికి ఎవరెవరు హాజరవబోతున్నారు అనే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.





Untitled Document
Advertisements