చెన్నై అభిమానులను పలకరించిన జడేజా.. ఆనందంలో ఫ్యాన్స్

     Written by : smtv Desk | Mon, Jan 23, 2023, 11:47 AM

చెన్నై అభిమానులను పలకరించిన జడేజా.. ఆనందంలో ఫ్యాన్స్

స్టార్ క్రికెటర్ లలో ఆల్ రౌండర్ గా చెప్పుకోబడే రవీంద్ర జడేజా ఒకరు. 2022 సెప్టెంబర్ లో ఆసియా కప్ లో భాగంగా మోకాలికి గాయం ఆయింది. ఈ గాయం తరువాత అతను ప్రేక్షకులకు కనిపించి చాలా నెలలు గడిచింది. ఒకవిధంగా చెప్పాలి అంటే ఈ గాయం కారణంగా అతడు భారత జట్టుకు దూరమయ్యాడు. అనంతరం చికిత్సతో కోలుకున్నాడు. వచ్చే నెలలో జరిగే ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్ కోసం జడేజాకు సెలక్టర్లు అవకాశం ఇచ్చారు. ఈ లోపు తమిళనాడుతో సౌరాష్ట్ర రంజీ ట్రోఫీలో భాగంగా జడేజా చెన్నై వచ్చాడు.
చెన్నై చేరుకున్న తర్వాత జడేజా ఓ రెండు పదాలతో ట్వీట్ చేశాడు. ‘వణక్కమ్ చెన్నై’ అన్నదే ఆ ట్వీట్. చెన్నై ప్రజలకు నమస్కారం చెప్పాడన్నమాట. చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో జడేజా కీలక సభ్యుడని తెలిసిందే. సుదీర్ఘకాలంగా అతడు సీఎస్కేతో కలసి సాగుతున్నాడు. జట్టు విజయాల్లో అతడు కీలక పాత్ర పోషించిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలో జడేజా ట్వీట్ కు చెన్నై జట్టు అభిమానులు ఉత్సాహంగా స్పందిస్తున్నారు.

‘‘జడేజాకు చెన్నై స్వాగతం పలుకుతోంది. సీఎస్కే అభిమాన ప్లేయర్ నువ్వు’’ అని ఓ యూజర్ కామెంట్ చేస్తే.. ‘‘నా అభిమాన రోల్ మోడల్ కు వణక్కమ్. మైదానంలోకి తిరిగి సింహం అడుగు పెడుతోంది’’ అని మరో అభిమాని కామెంట్ చేశాడు. సూపర్ కింగ్ కు తిరిగి స్వాగతం, జడ్డూ నీ రాకింగ్ పెర్ ఫార్మెన్స్ కోసం వేచి చూస్తున్నాం.. ఇలాంటి వ్యాఖ్యలతో అభిమానులు స్పందిస్తున్నారు. మరి గాయం తరువాత తిరిగి కోలుకుని మైదానంలోకి అడుగుపెట్టబోతున్న జడ్డూ ఏ మేరకు తన మార్క్ ఆటతీరుని కనబరుస్తాడు అనేది చూడాలి.
https://twitter.com/imjadeja/status/1617098105484365831?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1617098105484365831%7Ctwgr%5E8483188b0e853867b9c21526fafcbf985a870662%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Fflash-news-762868%2Fravindra-jadeja-two-worded-tweet-leaves-chennai-super-kings-fans-excited





Untitled Document
Advertisements