చరణ్ తో రెండవ షెడ్యూల్ చిత్రీకరించనున్న బోయపాటి..

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 12:05 PM

చరణ్ తో రెండవ షెడ్యూల్ చిత్రీకరించనున్న బోయపాటి..

హైదరాబాద్, ఫిబ్రవరి 2: ఏ వర్గం ప్రేక్షకులనైన ఇట్టే ఆకట్టుకోవడంలో దర్శకుడు బోయపాటి శ్రీను ముందుటారనడంలో అతిశయోక్తి లేదు. 'సరైనోడు', 'జయ జానకి నాయక' చిత్రాలతో ఘన విజయం అందుకొని మరో సరికొత్త కథతో సిద్ధమయ్యాడు బోయపాటి. ఈ చిత్రంలో రామ్ చరణ్ హీరోగా నటించబోతున్నాడు.

ప్రస్తుతం రామ్ చరణ్ 'రంగస్థలం' తో బిజీగా ఉండడంతో బోయపాటి ఇతర సన్నివేశాలను చిత్రీకరించి మొదటి షెడ్యుల్ ను పూర్తి చేశారు. చరణ్ తో వచ్చేవారం రెండవ షెడ్యూల్ కి రెడీ అవుతున్నాడు. చరణ్ పనులను బట్టి షెడ్యూల్స్ ను ప్లాన్ చేసుకున్న బోయపాటి, జూన్ చివరినాటికి అన్ని పనులను పూర్తి చేసి, జూలైలో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

Untitled Document
Advertisements