శర్వానంద్ సరసన కల్యాణి ప్రియదర్శన్...

     Written by : smtv Desk | Fri, Feb 02, 2018, 12:58 PM

శర్వానంద్ సరసన కల్యాణి ప్రియదర్శన్...

హైదరాబాద్, ఫిబ్రవరి 2: 'హలో' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన కల్యాణి ప్రియదర్శన్ కు ఓ మంచి చాన్స్ కొట్టేసింది. మొదటి సినిమాతోనే తన నటనతో అందరి మనసుల్ని కొల్లగొట్టేసింది ఈ సుందరి. దీంతో ఈ హీరోయిన్ ను ఎంపిక చేసుకోవడానికి యువ కథానాయకులు ఉత్సాహాన్ని చూపుతున్నారు.

ఈ నేపథ్యంలో ఆమెకి శర్వానంద్ కి జోడిగా నటించేందుకు అవకాశం దొరికినట్టు సమాచారం. సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ సినిమాలో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ అయితే బాగుంటుందని భావించి, ఆమెను ఎంపిక చేశారట. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

Untitled Document
Advertisements