మరోసారి పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా ఆల్ రౌండర్.. తన భార్యే వధువు

     Written by : smtv Desk | Mon, Feb 13, 2023, 05:14 PM

మరోసారి పెళ్లి చేసుకోబోతున్న టీమిండియా ఆల్ రౌండర్.. తన భార్యే వధువు

సినిమా తారలకు, క్రీడాకారులకు మధ్య విడదీయరానంత అనుబంధం ఉంటుంది. ఎక్కువగా వీరిలో ప్రేమ, పెళ్లి వంటి బంధాలు కొనసాగడం మనం కూడా చూస్తూనే ఉంటాము. సెర్బియాకు చెందిన నటాషా స్టాంకోవిచ్ ను హార్దిక్ పాండ్యా ప్రేమ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. నటాషా బాలీవుడ్ నటి. చాలాకాలంగా ప్రేమలో ఉన్న హార్దిక్ పాండ్యా, నటాషా కరోనా లాక్ డౌన్ సమయంలో రిజిస్టర్ మ్యారేజితో ఒక్కటయ్యారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయితే, టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా తన భార్యను మరోసారి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు. అందుకు రేపే (ఫిబ్రవరి 14) ముహూర్తం అని తెలుస్తోంది.
కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకోవాలని హార్దిక్, నటాషా నిర్ణయించుకున్నారు. నేటి నుంచి 16వ తేదీ వరకు వీరి పెళ్లి వేడుకలు జరగనున్నాయి. ఈ సెలెబ్రిటీ మ్యారేజికి రాజస్థాన్ లోని ప్రఖ్యాత పర్యాటక స్థలం ఉదయపూర్ వేదికగా నిలవనుంది. హల్దీ, మెహెందీ, సంగీత్ వేడుకలతో తమ పెళ్లిని సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని హార్దిక్ కోరుకుంటున్నాడు.





Untitled Document
Advertisements