గుండె ఆరోగ్యానికి ఈ విషయాలపై దృష్టి పెట్టడం ముఖ్యం..

     Written by : smtv Desk | Mon, Feb 13, 2023, 05:19 PM

గుండె ఆరోగ్యానికి ఈ విషయాలపై దృష్టి పెట్టడం ముఖ్యం..

ఈ మధ్యకాలంలో వయస్య్తో సంబంధం లేకుండా చాలా మంది గుండె జబ్బులతో మరనిస్తున్న్ విషయం తెలిసిందే. దీనికి గల కారణాలు అనేకం మారిన జీవనశైలీ, ఆహారపు అలవాట్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేకం. అయితే, ముందు నుంచి జాగ్రత్తలు తీసుకుంటే చాలా వరకు గుండె జబ్బులను నివారించొచ్చు. కానీ, చాలా మంది ఈ విషయంలో అశ్రద్ధ చూపిస్తుంటారు. సమస్య వస్తే కానీ స్పందించని వారే ఎక్కువ. కనుక గుండె ఆరోగ్యానికి సంబంధించి ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడం ఎంతో అవసరం.

రిస్క్
ప్రతి ఒక్కరూ తమ హెల్త్ రిస్క్ గురించి తెలుసుకోవాలి. గుండె జబ్బులకు వయసుతో సంబంధం లేదు. 20-30 ఏళ్లలోని వారు కూడా అక్కడక్కడా గుండె సమస్యలో ప్రాణాలు కోల్పోతున్నారు. గర్భిణులకు వచ్చే ముఖ్యమైన సమస్యల్లో గుండె జబ్బు ఒకటి. అందుకని రెండు మూడేళ్లకోసారి అయినా అన్ని రకాల పరీక్షలు చేయించుకోవాలి. దీనివల్ల కొలెస్ట్రాల్, బీపీ, మధుమేహం తదితర సమస్యల గురించి కీలక సమాచారం తెలుస్తుంది. అధిక బరువు కూడా ఎన్నో అనర్థాలకు దారితీస్తుంది. ముఖ్యంగా మెనోపాజ్ తర్వాత మహిళలకు గుండె సమస్యల రిస్క్ పెరుగుతుంది.

రక్తపోటు
మన శరీరంలో ప్రతీ భాగంలోని ప్రతి కణానికి రక్తం అందాలంటే గుండె నిర్ణీత ఒత్తిడితో దాన్ని పంప్ చేయాల్సి ఉంటుంది. కొన్ని రకాల కారణాలతో ఈ ఒత్తిడి పెరిగిపోతే దాన్ని అధిక రక్తపోటు, హైపర్ టెన్షన్ గా చెబుతారు. ఇలా అధిక రక్తపోటు దీర్ఘకాలం పాటు కొనసాగితే అది గుండెతోపాటు మూత్రపిండాలు సహా ఇతర ముఖ్యమైన అవయవాలకు నష్టం చేస్తుంది. అందుకని వైద్యుల సూచనల మేరకు ఆహార, జీవన నియమాల్లో మార్పులు చేసుకోవాలి. సూచించిన ఔషధాలు వాడుకోవాలి.

కుటుంబ చరిత్ర
ఇక తమకు గుండె జబ్బుల రిస్క్ ఉందని తెలుసుకోవాలని అనుకుంటే.. అందుకు కుటుంబ ఆరోగ్య చరిత్ర ఒక ముఖ్యమైన సూచిక అవుతుంది. తల్లిదండ్రులు, వారి తోడబుట్టిన వారు, మేనమామలు, మేనత్తలను అడిగి వారికి ఏవైనా తీవ్ర అనారోగ్య సమస్యలు ఉన్నాయేమో తెలుసుకోవాలి. గుండె పోటు రావడం, స్ట్రోక్, మూత్రపిండాల వైఫల్యం గురించి ప్రశ్నించాలి. ఎందుకంటే కొందరికి జన్యుపరంగా వ్యాధుల ముప్పు ఉంటుంది.

ఛాతీలో నొప్పి
ఛాతీలో నొప్పిని నిర్లక్ష్యం చేయవద్దు. అలా అని ఛాతీ భాగంలో వచ్చే ప్రతి నొప్పి కూడా గుండెకు సంబంధం ఉందనుకోవద్దు. ఛాతీలో తీవ్ర అసౌకర్యం, భారం, బరువు మోపినట్టు అనిపిస్తే అప్రమత్తం కావాలి. అలాగే అజీర్ణం, నొప్పి మెడ భాగం నుంచి చేతిలోకి పాకుతుండడం, గుండె దడ, తలతిరగడం, సొమ్మసిల్లి పడిపోవడం ఇవన్నీ కూడా గుండెకు సంబంధించినవే. ఉన్నట్టుండి చెమటలు పట్టేయడం, తలతిరగడం, ఛాతీలో భరించలేనంత నొప్పి కూడా గుండె పోటు లక్షణాలే.

నిద్ర
నిద్రకు ప్రాముఖ్యం ఇవ్వాలి. రోజువారీ 8 గంటలకు తక్కువ కాకుండా నిద్ర పోవాలి. స్లీప్ ఆప్నియా సమస్య ఉంటే నిద్ర సరిగ్గా పట్టదు. వీరికి కూడా గుండె జబ్బుల రిస్క్ పెరుగుతుంది. గురక పెడుతున్నా సరే ఓసారి కార్డియాలజిస్ట్ ను సంప్రదించడం అవసరం. పొగతాగే అలవాటు ఉంటే వెంటనే మానుకోవాలి. మద్యపానం మానేయాలి.

ఒత్తిడి
ఒత్తిడిని అదుపులో పెట్టుకోవడం చాలా అవసరం. లేదంటే ఆ ఒత్తిడి ప్రభావం గుండెపై పడి అనర్థాలకు దారితీస్తుంది.





Untitled Document
Advertisements