వింటర్ ఒలింపిక్స్ కు శివ కేశవన్‌, జగదీష్‌ సింగ్‌..

     Written by : smtv Desk | Sat, Feb 03, 2018, 12:07 PM

 వింటర్ ఒలింపిక్స్ కు శివ కేశవన్‌, జగదీష్‌ సింగ్‌..

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 3 : దక్షిణ కొరియాలో ఈ నెల 9న ప్రారంభమయ్యే వింటర్‌ ఒలింపిక్స్‌లో భారత్‌ తరఫున శివ కేశవన్‌, జగదీష్‌ సింగ్‌ అర్హత సాధించారు. 36 ఏళ్ల కేశవన్‌ (లూజ్‌ విభాగం) ఈ పోటీల్లో పాల్గొనడం ఇది ఆరోసారి. 1998లో తొలిసారి పాల్గొన్న అతను 2002, 2006, 2010, 2014 క్రీడల్లోనూ దేశానికి ప్రాతినిధ్యం వహించాడు. మరోవైపు జగదీష్‌సింగ్‌ (క్రాస్‌కంట్రీ స్కీయింగ్‌)కు ఇవే తొలి వింటర్ ఒలింపిక్స్ కావడం గమనార్హం.

Untitled Document
Advertisements