జూనియర్ ఎన్టీఆర్ పై వస్తున్న ట్రోల్లింగ్ పై గుహలక్ష్మి నటి ఫైర్

     Written by : smtv Desk | Mon, Feb 27, 2023, 05:03 PM

జూనియర్ ఎన్టీఆర్ పై వస్తున్న ట్రోల్లింగ్ పై గుహలక్ష్మి నటి ఫైర్

ఆర్ఆర్ఆర్ ఈ పేరు చెబితే తెలుగోడికి మాత్రమే కాదు దేశ వ్యాప్తంగా గర్వంగా అనిపిస్తుంది. టాలీవుడ్ లో తెరకెక్కి ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన సినిమా ఆర్ఆర్ఆర్. ఈ సినిమా హాలీవుడ్ లో హంగామా సృష్టిస్తూ గోల్డెన్ గ్లోబ్ వేదికపైనా మెరిసిన సంగతి తెలిసిందే. అయితే గోల్డెన్ గ్లోబ్ అవార్డుల కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్ ఇంగ్లీషులో ప్రసంగించగా, ఆయన యాసపై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. ఎన్టీఆర్ ది ఫేక్ యాక్సెంట్ అంటూ, ఆయనను మంచు లక్ష్మితో పోల్చడం మొదలుపెట్టారు.

ఆయన పై వస్తున్న ట్రోల్స్ పై దక్షిణాది నటి కస్తూరి స్పందించారు. గోల్డెన్ గ్లోబ్ కార్యక్రమంలో ఎన్టీఆర్ చక్కగా మాట్లాడారని, ఆయనపై ట్రోలింగ్ సరికాదని హితవు పలికారు. అమెరికన్లకు అక్కడి యాసలో మాట్లాడితేనే అర్థమవుతుందని అన్నారు. ఎన్టీఆర్ చేసింది అదేనని, అందులో తప్పుబట్టడానికేమీ లేదని తెలిపారు.

తాను కొంతకాలం అమెరికాలో ఉన్నానని, అక్కడి వారికి ఎలాంటి యాసలో మాట్లాడితే అర్థమవుతుందో తనకు తెలుసని కస్తూరి వెల్లడించారు. అయితే, అది అమెరికాలో మాత్రమే వర్తిస్తుందని, మనదేశానికి వచ్చి అమెరికన్ యాసతో తెలుగు మాట్లాడితే కచ్చితంగా ట్రోల్ చేస్తారని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ ను మంచు లక్ష్మితో పోల్చవద్దని పేర్కొన్నారు. మరి తులసి మాటలు మన ట్రోలింగ్ బాబు వింటారో లేదో.





Untitled Document
Advertisements