వాడిని దారుణంగా చావగొడతాను: సుధీర్‌ బాబు

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 01:47 PM

వాడిని దారుణంగా చావగొడతాను: సుధీర్‌ బాబు

హైదరాబాద్, ఫిబ్రవరి 4: కన్న కొడుకు అని చూడకుండా కసాయిలా ప్రవర్తించాడు ఓ తండ్రి. ఓ చిన్న అబద్ధం చెప్పాడనే కారణంతో చితకబాదాడు. ఈ ఘటన బెంగళూరులో జనవరి 27న చోటుచేసుకుంది. ఆ చిన్న పిల్లాడిని కొడుతున్న దృశ్యాలను వీడియో తీయించి ఆ వీడియోను బాలుడికే చూపించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్ గా మారింది.

ఈ వీడియో పై యువ నటుడు సుధీర్‌ బాబు స్పందించారు. తన ఫేస్ బుక్ వేదికగా.. 'ప్లీజ్‌.. అతను ఎక్కడుంటాడో కనుక్కోండి. ఇంతకంటే దారుణంగా వాడిని చావగొడతాను. అతనో తండ్రి అని చెప్పడానికి కూడా సిగ్గుగా ఉంది' అంటూ బాలుడిని బాదిన వీడియో షేర్‌ చేశారు. ఇందులో మరో విషయం ఏంటంటే.. కళ్ల ముందు కన్న బిడ్డ ఏడుస్తుంటే ఆపాల్సిందిపోయి తల్లే భర్తను ఉసిగొల్పి కొట్టించడం.

ఈ దారుణమైన సంఘటన బాలుడి తల్లి తన ఫోన్‌లో సమస్య ఉందని స్థానిక మొబైల్‌ షాపులో రిపేర్‌ చేయమని ఇవ్వడంతో వెలుగులోకి ఇచ్చింది. బాలుడిని విచక్షణారహితంగా కొట్టినందుకు గాను తండ్రిని అక్కడి పోలీసులు జువెనైల్‌ యాక్ట్‌ కింద అరెస్ట్‌ చేశారు.

Untitled Document
Advertisements