ఆదర్శ మహిళ.. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న భర్తపై పోలీసులకు పిర్యాదు

     Written by : smtv Desk | Thu, May 11, 2023, 09:04 AM

ఆదర్శ మహిళ.. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తున్న భర్తపై  పోలీసులకు పిర్యాదు

హెల్మెట్ లేని ప్రయాణం ప్రమాదకరం అని నెత్తినోరు బాదుకుని ప్రభుత్వము మరియు పోలీసులు ఎంత మొత్తుకున్నా కూడా వాహనదారులలో ఏ మాత్రం చలనం అనేది ఉండడం లేదు. ఎన్ని రకాల చర్యలు చేపట్టినా ప్రయత్నం మాత్రం శూన్యం. తాజాగా హెల్మెట్ లేకుండా స్కూటీపై ప్రయాణించిన ఓ వ్యక్తి బండారం బట్టబయలు కావడంతో భార్య ఆగ్రహానికి గురయ్యాడు. ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో చివరకు జైలు పాలయ్యాడు. హెల్మెట్ లేకుండా ప్రయాణించినందుకు కేరళ ట్రాఫిక్ పోలీసులు ఓ వ్యక్తికి జరిమానా విధించారు. సీసీటీవీ కెమెరాకు చిక్కిన అతడి ఫొటోలను కూడా పంపించారు. స్కూటీ భార్య పేర రిజిస్టర్ అయి ఉండటంతో ఈ జరిమాన తాలుకు వివరాలు, భర్త ఫొటో అతడికి భార్యకు అందాయి. అయితే, ఆ ఫొటోల్లో భర్త మరో మహిళతో కలిసి ప్రయాణించడం అతడి భార్య కంట పడింది.

ఈ విషయమై ఆమె అతడిని నిలదీసింది. కానీ, తాను ఏ తప్పు చేయలేదని అతడు భార్యకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. దారిన పోయే మహిళకు తాను లిఫ్ట్ మాత్రమే ఇచ్చానని చెప్పుకొచ్చాడు. కానీ, అతడి వివరణతో భార్య సంతృప్తి చెందకపోవడంతో వారి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరకు మే 5 భర్తపై ఆమె కారామానా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తనపై దాడి చేశాడని తన ఫిర్యాదులో పేర్కొంది. మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆమె భర్తను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టు అతడిని జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు ఆ మహిళ భర్త చేసిన పనికి తగిన రీతిలో బుద్ది చెప్పింది అంటూ అభినందిస్తున్నారు.





Untitled Document
Advertisements