నాగబాబు తనయుడి పెళ్లి ఫిక్స్ ?

     Written by : smtv Desk | Wed, May 17, 2023, 02:24 PM

నాగబాబు తనయుడి పెళ్లి ఫిక్స్ ?

ప్రస్తుతం మెగా అభిమానుల చూపంతా కూడా నాగబాబు తనయుడు వరుణ్ తేజ్ మీదనే ఉంది. వరుణ్ తేజ్ వివాహ విషయంగా ఓ వార్త మరోసారి వైరల్ అవుతోంది. లావణ్య త్రిపాఠిని వరుణ్ తేజ్ వివాహం చేసుకోనున్నట్టు ఆ మధ్య వార్తలు కూడా వచ్చాయి. తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు అది నిజమేనని తెలుస్తోంది. వరుణ్ తేజ్, లావణ్య వివాహానికి ఇరు కుటుంబాలు ఆమోదం తెలిపినట్టు సమాచారం. కాకపోతే పెళ్లి ముహూర్తాన్ని వారు ఇంకా నిశ్చయం చేసుకోలేదన్నది వార్తల సారాంశం.
నాగబాబు కుటుంబంలో జరిగే కార్యక్రమాలకు లావణ్య వస్తుంటుంది. నిహారిక వివాహం సందర్భంగా ఆమె సందడి చేయడం అభిమానులకు తెలుసు. అప్పుడే వారి మధ్య ఏదో ఉందన్న గుసగుసలు వినిపించాయి. వీరిద్దరూ ఓ ఇంటి వారు అవుతారంటూ అప్పటి నుంచే ప్రచారం మొదలైంది. దీన్ని వారు ఖండించలేదు కూడా. సాధారణంగా నాగబాబు మౌనంగా ఉండే రకం కాదు. అయినా, తన కుమారుడు వరుణ్ తేజ్ పెళ్లి విషయంలో వస్తున్న వార్తలకు ఆయన ఎప్పుడూ పుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయలేదు. దీంతో మరోసారి వీరి పెళ్లిపై చర్చ మొదలైంది. త్వరలో నిశ్చితార్థం, కొంత విరామం తర్వాత పెళ్లి ఉంటుందని అంటున్నారు. మరి ఈ సారైనా మెగా ఫ్యామిలి ఈ వార్తలపై స్పందిస్తుందో లేదో చూడాలి.





Untitled Document
Advertisements