చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి ఫోన్..!

     Written by : smtv Desk | Sun, Feb 04, 2018, 04:08 PM

చంద్రబాబుకు కేంద్ర హోంమంత్రి ఫోన్..!

అమరావతి, ఫిబ్రవరి 4 : బడ్జెట్ సమావేశాల్లో ఏపీకి అన్యాయం జరిగిందంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు తెదేపా పార్లమెంటరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశాల్లో భాగంగా చంద్రబాబు మాట్లాడుతూ.. బడ్జెట్లో ఏపీ రాష్ట్ర౦ ప్రస్తావనే రాకపోవడం చాలా బాధాకరమన్నారు. కనీసం మిత్రపక్షంగానైనా ఏపీని గౌరవించలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంటులో పోరాడాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చంద్రబాబు నాయుడుకు ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవద్దంటూ కోరినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. రాజ్‌నాథ్‌ సింగ్‌ నుంచి ఫోన్ రావడంతో తెదేపా తన వ్యూహాన్ని మార్చుకున్నట్లు సమాచారం.

Untitled Document
Advertisements