జాతరలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది : వెంకయ్య

     Written by : smtv Desk | Mon, Feb 05, 2018, 03:58 PM

జాతరలో పాల్గొన్నందుకు సంతోషంగా ఉంది : వెంకయ్య

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 5 : రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు.. మేడారం జాతర విషయాలను రాజ్యసభలో పంచుకున్నారు. జాతరను సందర్శించిన అనుభవాలను సభ్యులతో చెబుతూ.. సమ్మక్క, సారలమ్మల ఔనత్యాన్ని వివరించారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ మేడారం మహా జాతరకు కోటి 50 లక్షల మంది భక్తులు హాజరైనట్లు పేర్కొన్నారు. ఎనిమిది రాష్ర్టాల నుండి జాతరకు విచ్చేసిన భక్తులకు తెలంగాణ ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పించింది. ఈ జాతరలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఫీలవుతున్నానని తెలిపారు. కాగా మేడారం జాతరను "మినీ కుంభమేళా" గా వెంకయ్య అభివర్ణించిన విషయం తెలిసిందే.

Untitled Document
Advertisements