గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత..

     Written by : smtv Desk | Wed, Feb 07, 2018, 10:58 AM

గాలి ముద్దుకృష్ణమనాయుడు కన్నుమూత..

హైదరాబాద్, ఫిబ్రవరి 7 ‌: టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ, మాజీ మంత్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు మంగళవారం అర్ధరాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన రెండ్రోజులుగా జ్వరంతో బాధపడుతూ హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 1947 జూన్ 9న చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం వెంకటరామాపురంలో జన్మించారు.

గుంటూరు జిల్లా పెదనందిపాడు ఆర్ట్స్‌ అండ్‌ సైన్స్‌ కళాశాలలో అధ్యాపకునిగా పనిచేసిన ఆయన ఎన్టీఆర్‌ పిలుపుతో 1983లో రాజకీయ రంగప్రవేశం చేశారు. తెలుగురాష్ట్రాల్లో ఆయన అందరికీ సుపరిచితులు. ఆయన మరణంతో తెలుగుదేశం వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాయి. పార్టీలో పలువురు నాయకులూ, ప్రతినిధులు అతని మృతిపై సంతాపం వ్యక్తం చేశారు.

Untitled Document
Advertisements