దేవినవరాత్రుల వేళ సులభంగా చెక్కెర పొంగలి సిద్దం ఇలా..

     Written by : smtv Desk | Wed, Oct 18, 2023, 01:11 PM

దేవినవరాత్రుల వేళ సులభంగా చెక్కెర పొంగలి సిద్దం ఇలా..

అమ్మవారిని పూజించే ఈ నవరాత్రులలో రోజుకో రకమైన ప్రసాదం తాయారు చేయడం ఆనవాయితీ. అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలలో ఒకటైన చెక్కెర పొంగలి ఎలా తాయారు చేయాలో చూద్దామా..

చెక్కెర పొంగలి కావాల్సిన పదార్ధాలు

బియ్యం               1 కప్పు
నీరు      3 కప్పులు
చెక్కెర లేదా బెల్లం     1/3 కప్పు
పాలు       1/2 లీటర్ 
నెయ్యి       20 గ్రా
జీడిపప్పు               10
బాదాంపప్పు            10
ఎండుద్రాక్ష    10
ఏలకులు    4

తయరివిధానం :-  ముందుగా బియ్యం కడిగి అందులో నీరుపోసి ప్రెషర్ కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేవరకు ఉడికించుకోవాలి. ప్రెషర్ పూర్తిగా తీసేసి అందులో బెల్లం లేదా పంచదార వేసి బాగా కలుపుకుని పాలు పోసుకోవాలి. అన్నం మెత్తుకులు కనిపించకుండా మెత్తగా ఉడికించుకోవాలి.తరువాత ఒక చిన్న బాండిలో నెయ్యి వేడి చేసుకుని డ్రైఫ్రూట్స్  ను గోల్డ్ కలర్ వచ్చేంతవరకు వేయించుకుని, నెయ్యితో పాటుగా ఉడికించిన అన్నంలో కలుపుకోవాలి. చివరగా యాలకుల పొడి వేసి కలుపుకుంటే దేవికి నివేదించవలసిన నైవేద్యం సిద్దం





Untitled Document
Advertisements