ఇంగువతో మీ చర్మాన్ని మెరిపించండిలా..

     Written by : smtv Desk | Wed, Oct 18, 2023, 05:25 PM

ఇంగువతో మీ చర్మాన్ని మెరిపించండిలా..

ఇంగువ వంటకాలకు రుచి మరియు సువాసనని అందిస్తుంది. అంతేకాక ఇంగువ ఆరోగ్యానికి ఎంతో మంచిది అనే విషయం మనకు తెలిసిందే. అయితే ఇంగువని అందం కొరకు కూడా ఉపయోగిస్తారట, దీనితో ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు.
ఇంగువతో ఫేస్ ప్యాక్.. విని ఆశ్చర్యపోవద్దు. దీని వల్ల కలిగే బెనిఫిట్స్ మామూలుగా ఉండవు. ఇందుకోసం రెండు చెంచాలా ముల్తానీ మట్టిలో ఓ చెంచా తేనె, చిటికెడు ఇంగువ, చెంచా రోజ్ వాటర్ కలపండి. దీనిని ప్యాక్‌లా చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాలు అలానే ఉంచి ఆరిన తర్వాత కడిగేయాలి. దీని వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం.
​యవ్వనంగా.. చాలా మందికి వయసు పెరగడం కారణంగా ముడతలు కనిపిస్తాయి. అయితే, కొంతమందికి పోషకాహార లోపం, ఒత్తిడి, స్కిన్ కేర్ లేకపోవడం వల్ల ముందుగానే వస్తాయి. అలాంటి సమస్యకి ఇంగువ చక్కగా పనిచేస్తుంది. ఇంగువతో ఫేస్‌‌ప్యాక్ వేసుకుంటే చర్మంలో ఆక్సిజన్ సరఫరా పెరిగి ప్రకాశవంతంగా మారుతుంది.
కాంతివంతంగా.. ఎవరైనా కూడా తమ చర్మం కాంతివంతంగా, తాజాగా ఉండాలని కోరుకుంటారు. అలాంటి వారు ఈ ఇంగువ ఫేస్‌ప్యాక్‌ని ట్రైచేయొచ్చు. ఇంగువని సహజ గుణాలు చర్మంలోని టైరోసిన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది.
టైరోసిన్ కారణంగా మెలనిన్ ఉత్పత్తి పెరిగి చర్మం నల్లబడడం, వృద్ధాప్యం వంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి, వీటన్నింటికి ఇంగువ ప్యాక్ చెక్ పెడుతుంది.
మొటిమలు.. చాలా మంది ఎదుర్కొనే సమస్యల్లో మొటిమలు కూడా ఒకటి. ఎన్ని వాడినా కొంతమందికి మొటిమలు తగ్గవు. అలాంటి సమస్యకి ఇంగువ చక్కని ఇంటి చిట్కాలా పనిచేస్తుంది. కాబట్టి, ఇంగువ ప్యాక్‌ని ట్రై చేయొచ్చు.
​హైడ్రేటెడ్.. చాలా మందికి కాలుష్యం, ఒత్తిడి కారణంగా చర్మం పొడిబారుతుంది. అలాంటి వారు ఇంగువ ఫేస్ ప్యాక్‌ని వాడొచ్చు. దీని వల్ల చర్మం హైడ్రేట్ అవుతుంది. చర్మం పొడిబారడం, డ్రైగా మారడం, పగుళ్ళు, మచ్చలు, ముడతలు వంటి లక్షణాలను ఈ ప్యాక్ దూరం చేస్తుంది.





Untitled Document
Advertisements