జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్స్ ఇవే!

     Written by : smtv Desk | Thu, Oct 26, 2023, 05:57 PM

జుట్టు ఆరోగ్యానికి కావాల్సిన విటమిన్స్ ఇవే!

ప్రస్తుత కాలంలో జుట్టు యొక్క ఆరోగ్యం అనేది కష్టంగా మారిపోయింది. పెరిగిపోయిన వాతావరణ కాలుష్యం, మారిన ఆహారపు అలవాటులు, ఒత్తిడి వంటి కారణాల వలన జుట్టు రాలిపోవడం, పొడిబారడం, చిట్లిపోవడం, చుండ్రు వంటి అనేక సమస్యలు ఏర్పడుతున్నాయి. ఈ సమస్యలను దూరం చేసుకోవడానికి మార్కెట్లో దొరికే ప్రాడక్ట్స్ అన్ని వాడుతుంటారు. అయితే జుట్టు ఆరోగ్యానికి మనం చేయాల్సింది పోషకాహారం తీసుకోవడం మాత్రమె అంటున్నారు నిపుణులు. జుట్టును సంరక్షించడానికి కొన్ని విటమిన్లు ముఖ్యపాత్ర పోషిస్తాయి. రోజూ వారీ తీసుకునే ఆహారంలో ఈ పోషకాలు చేర్చుకుంటే.. ఒత్తైన, పట్టులాంటి జుట్టును సొంతం చేసుకోవచ్చు.​


విటమిన్‌ ఏ..
జుట్టు ఆరోగ్యాన్ని రక్షించే పోషకాల్లో విటమిన్‌ A మొదటి వరుసలో ఉంటుంది. విటమిన్‌ A కణాల పెరుగుదలకు సహాయపడుతుంది, ఇది హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహిస్తుంది. ఇది సెబమ్‌‌ను ఉత్పత్తి చేయడానికి తోడ్పడుతుంది, మాడును తేమగా, జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది. మీ డైట్‌లో బొప్పాయి, క్యారెట్, ఆకుకూరలు, గుడ్లు, చేపనూనె, పాలు, గుమ్మడి పండు, జామ పండు, వెన్న, టొమాటో వంటి ఆహార పదార్థాలు చేర్చుకోండి.​

బి - కాంప్లెక్స్‌ విటమిన్‌..
బి - కాంప్లెక్స్‌ విటమిన్‌లు జుట్టు ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. విటమిన్‌ B1, B2, B3, B5, B6, B7, B9, B12 వంటి బి గ్రూప్‌ విటమిన్ల లోపం కారణంగా.. హెయిర్‌ ఫాల్‌ సమస్య ఎదురవుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. హెయిర్‌ గ్రోత్‌ ప్రోత్సహించడానికి వేరుశనగ, తవుడు, సోయాబీన్స్, దంపుడు బియ్యం, కొబ్బరి, బార్లీ వంటి ఆహారాలు మీ డైట్‌లో చేర్చుకోండి.​

విటమిన్‌ సి..
విటమిన్‌ సి శక్తివంతమైన యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. అది జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. విటమిన్‌ సి.. కొల్లాజెన్‌ ప్రొటీన్‌ ఉత్పత్తికి సహాయపడుతుంది. మీ ఆహారంలో నిమ్మ, ఉసిరి, జామకాయలు, టొమాటో, ఆకుకూరలు చేర్చుకోండి.

విటమిన్‌ డి..
విటమిన్‌ డి లోపం హెయిర్‌ ఫాల్‌ సమస్యకు దారి తీస్తుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. మీ హెయిర్‌ గ్రోత్‌ను ప్రోత్సహించడానికి, హెయిర్‌ ఫాల్‌ కంట్రోల్‌ చేయడానికి.. విటమిన్‌ డి సమృద్ధిగా పొందాలి. డెర్మటాలజీ ప్రాక్టికల్ అండ్ కాన్సెప్చువల్ జర్నల్‌లో ప్రచురించిన ఓ అధ్యయనం ప్రకారం.. విటమిన్‌ డి లోపం హెయిర్‌ ఫాల్‌కు దారితీస్తుంది.

విటమిన్‌ ఇ..
విటమిన్‌ E శక్తివంతమై యాంటీఆక్సిడెంట్‌గా పనిచేస్తుంది. ఇది ఫ్రీ రాడికల్స్‌ను బ్యాలెన్స్‌ చేస్తుంది, ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడానికి తోడ్పడుతుంది. జుట్టుకు ఆక్సిజన్, రక్తాన్ని సమృద్ధిగా అందించడంలో ఇది కీలకంగా వ్యవహరిస్తుంది. డాండ్రఫ్​ సమస్య నుంచి చాలా వరకు విముక్తి కలిగిస్తుంది. జుట్టును పొడిబారకుండా చేస్తుంది. మీ ఆహారంలో సోయా చిక్కుడు, పత్తి గింజల నూనె, పామ్ ఆయిల్, గోధుమ, చిలగడ దుంపలు, పొద్దు తిరుగుడు గింజల నూనె చేర్చుకోండి.

ఆహారంలో తేలికపాటు మార్పులు చేసుకోవడంతో పాటు మాడును శుభ్రంగా ఉంచుకోవాలి. అలాగే వారానికి ఒకసారి కొబ్బరి నూనెతో జుట్టు కుదుర్లకు పట్టించుకోవాలి.





Untitled Document
Advertisements