'టీ' ని వీటితో పాటు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం..

     Written by : smtv Desk | Wed, Nov 08, 2023, 01:06 PM

'టీ'  ని వీటితో పాటు తీసుకోవడం ఆరోగ్యానికి హానికరం..

ఉదయం లేవగానే రోజు మొదలయ్యేది టీ తాగడంతోనే. కొంతమందికి అయితే కడుపులో టీ నీళ్ళు పడలేదు అంటే క్షణం కూడా గడవదు. అయితే చాలా మంది శారీరక అలసటను మర్చిపోవడానికి మానసిక ప్రశాంతత కోసం టీ తాగుతూ ఉంటాం. మన దేశ వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా కూడా టీ ల్లో ఎన్నో రకాలు ఉన్నాయి. కొందరు చాయ్ తాగే విధానం విభిన్నంగా ఉంటుంది.
కొందరు పూర్తిగా చల్లారిన తర్వాత టీ తాగితే.. మరి కొందరు పొగలు కక్కుతున్న టీ తాగాలి అనుకుంటారు. టీ ఎలా తాగిన పర్వాలేదు కానీ ఇప్పుడు మేము చెప్పబోతున్న పదార్థాలతో కలిపి మాత్రం తాగకూడదు.. అలాగే టీ తాగిన తర్వాత కనీసం అర్థగంట లేదా గంట తర్వాత మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే పదార్థాలను తీసుకోవాలి.
మొదటగా టీ లో నిమ్మరసం వాడకూడదు. వేడి టీ లో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆ టీ కాస్త ఆమ్లంగా మారుతుంది.
అది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. టీ తాగిన వెంటనే ఏవైనా పండ్లు తినడం మంచిది కాదు. కనీసం గంట గ్యాప్ ఉండేలా చూసుకుంటే బెటర్.
టీ తో పాటు పెరుగు తీసుకోవడం లేదా టీ తాగిన వెంటనే పెరుగు తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తే అవకాశం ఉంది. వేడి టీ తాగిన వెంటనే చల్లటి ఐస్‌ క్రీమ్‌ తినకూడదు. అలా చేస్తే గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటూ నిపుణులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements