బ్రిటన్ రాజకీయాలలో కీలక మలుపు .. సునాక్‌పై అవిశ్వాస లేఖ

     Written by : smtv Desk | Tue, Nov 14, 2023, 10:14 AM

బ్రిటన్ రాజకీయాలలో కీలక మలుపు .. సునాక్‌పై అవిశ్వాస లేఖ

రాష్ట రాజకీయాల నుండి అంతర్జాతీయ రాజకీయాల వరకు అలజడులు రేకెత్తడం సహజం. రాజకీయాలలో ఏ చిన్న అవకాశం దొరికినా అధికారపక్షం మీద విపక్షాలు విరుచుకుపడడం సహజం. తాజాగా బ్రిటన్ రాజకీయాలు కీలక మలుపు తీసుకున్నాయి. హోం సెక్రెటరీ సుయెల్లా బ్రెవర్మన్‌ను మంత్రివర్గం నుంచి తొలగించినందుకు తీవ్ర విమర్శల పాలవుతున్న రిషి సునాక్‌‌పై సొంత పార్టీ ఎంపీ ఆండ్రియా జెంకిన్స్ అవిశ్వాస తీర్మానం లేఖ ప్రవేశపెట్టారు. ఈ తీర్మానం తాలూకు ఫొటోను నెట్టింట పంచుకున్నారు.
‘‘ఇలా చాలు. రిషి సునాక పక్కకు తప్పుకోవాల్సిందే’’ అని జెంకిన్స్ ఎక్స్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. తన అవిశ్వాస తీర్మానం తాలూకు లేఖను పార్టీలోని 1922 కమిటీకి పంపినట్టు చెప్పారు. ‘‘నిజం మాట్లాడినందుకు ఆమెను తప్పించారు. పార్టీలోని లెఫ్ట్ నేతల ఒత్తిడికి లోనై రిషి తప్పుడు నిర్ణయం తీసుకున్నారు’’ అని ఎక్స్ వేదికగా కామెంట్ చేశారు. పాలస్తీనా అనుకూల ప్రదర్శన విషయంలో పోలీసులు తమ ఇష్టాఇష్టాలను అనుగుణంగా వ్యవహరించారంటూ విమర్శించిన సెయెల్లా బ్రెవర్మెన్ తన మంత్రి పదవి కోల్పోవాల్సిన విషయం తెలిసిందే.

కాగా, రిషి సునాక్‌పై జెంకిన్స్ విరుచుకుపడ్డారు. ప్రజాస్వాయుతంగా ఎన్నికైన బోరిస్ జాన్సన్ పక్కకు తప్పుకోవడానికి కూడా రిషి సునాక్ కారణమని ఆరోపించారు. బ్రెక్జిట్ కోసం బోరిస్ పార్లమెంటులో ధైర్యంగా పోరాడారని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ పదవుల్లో లేని అధికార పార్టీ ఎంపీలు 1922 కమిటీలో ఉంటారు. ఈ కమిటీ సభ్యులు ప్రభుత్వ, తమ పార్టీ నిర్ణయాలను ప్రభావితం చేయగలరు.





Untitled Document
Advertisements