కాటన్ దుస్తువుల నాణ్యత గుర్తించండిలా..

     Written by : smtv Desk | Wed, Nov 15, 2023, 07:56 AM

కాటన్ దుస్తువుల నాణ్యత గుర్తించండిలా..

ఏకాలంలో అయినా అటువంటి ఆలోచన లేకుండా ధరించి ఎంతో సౌకర్యవంతమైన అనుభూతి పొందగలిగే దుస్తువులు కాటన్ దుస్తువులు మాత్రమే. ఉదాహరణకి అల్లిన దుస్తులు, సిల్క్ లాంటివి మనం అన్నీ వేళలా వేసుకోలేము వాటిని కేవలం కొన్ని కాలాల్లో మాత్రమే వాడగలం. ఎండాకాలం, వానా కాలం, చలికాలం అనే తేడా లేకుండా అన్నికాలాల్లోను కాటన్ దుస్తువులను సులభంగా క్యారీ చేయవచ్చు.

అయితే ఈ మధ్య కాలంలో చాలా వరుకు దుస్తులు బ్లెండెడ్ రకాలే వస్తున్నాయి. సిల్క్, కాటన్ కానీ కాటన్, రేయాన్ కానీ ఇలా పలు రకాల ఫ్యాబ్రిక్స్ కలిపి ఒక బ్లెండ్ చేసి ఒక ఫ్యాబ్రిక్ గా ఉత్పత్తి చేస్తున్నారు. మరి అలాంటి కాటన్ దుస్తులు కొనేటప్పుడు అవి ఎంత వరుకు స్వచ్ఛంగా ఉన్నాయో మనకి ఎలా తెలుస్తుంది ?

కాటన్ దుస్తులను కొన్ని ప్రముఖ లక్షణాలు ఉన్నాయి. వాటి ఆధారంగా మనం కొనే బట్ట స్వచమైనది అవునో కాదో తెలుసుకునే అవకాశం ఉంది. అది ఎలానో చూద్దాం.

మొదటగా ఏదైనా కాటన్ బట్టను చేతిల్లోకి తీసుకుని దాన్ని మన చేతి వేళ్ళతో తాకి చూడడమో లేదా అంతే కంటే కోమలంగా ఉండే మన చెంపల పై ఆ బట్టను రుద్దడమో చేసినప్పుడు మనకి ఆ బట్ట యొక్క ఆకృతి మృదువుగా అనిపించినట్లైతే అది కాటన్ అని నిరధారించుకోవచ్చు. ఒకవేళ మనకి ఆ బట్ట ఆకృతి తెలియకుండా అది కేవలం మృదువుగా మాత్రమే ఉన్నట్టు అనిపిస్తున్నట్లైతే అది బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ అని అర్థం.

సహజంగా మనం కాటన్ దుస్తులు ధరించినప్పుడు లేదా, వాటిని జాగ్రత్త చేసేటప్పుడు సరైన జాగ్రత్తలు తీస్కోనట్లైతే అవి నలిగిపోయినట్లుగా అయిపోతాయి. ఈ లక్షణం కూడా కాటన్ దుస్తుల స్వచ్ఛతను తెలియజేయడంలో ఉపయోగపడుతుంది.

మిగతా వాటితో పోలిస్తే కాటన్ దుస్తులకు ఎక్కువ శాతం నీటిని పీల్చికునే సామర్థ్యం ఉంటుంది. అందుకనే మనం ఎండా కాలంలో ఎక్కువగా కాటన్ దుస్తులకు ప్రాధాన్యత ఇస్తాము. ఇలా కూడా మనం అది కాటన్ బట్ట అవునో కాదో చెప్పవచ్చు. ఇందుకోసం ఒక కాటన్ బట్టను తీసుకుని దాన్ని నీటిలో ముంచి ఆ బట్టను పిండినప్పుడు ఒకవేళ దాని నుండి ఎక్కువ శాతం నీరు వస్తే అది కాటన్ అని లేకపోతే అది బ్లెండెడ్ రకమని పరిగణించవచ్చు.

ఇక అన్నిటికంటే చివరిది అలాగే ప్రామాణికమైనది. మనం ఈ పరీక్ష ఆధారంగా కాటన్ స్వచ్ఛతను సులువుగా కనిపెట్టవచ్చు. అదెలానో చూద్దాం.

సాధారణంగా మనం దీపావళి, సంక్రాంతి లాంటి ముఖ్యమైన పండుగలకు తెల్లని కాటన్ బట్టను చించి వాటిని ఒత్తుల్లా తయారు చేసి దీపాలు వెలిగిస్తూ ఉంటాము. ఈ రకమైన ఒత్తులు చాలా సేపటి వరకు వెలగుతాయి.

ఇప్పుడు ఈ విషయాన్ని ఆధారంగా చేసుకుని ఏదైనా కాటన్ బట్టను తీస్కుని దానికి నిప్పంటించినప్పడు ఒకవేళ అది కానీ నెమ్మదిగా కాలుతున్నట్లైతే దాన్ని మనం కాటన్ అని అనుకోవచ్చు. అలానే ఆ గుడ్డ మొత్తం కాలిపోయిన తరువాత బూడిదలాగా ఏర్పడినా కూడా అది కాటన్ అని నిర్ధారించవచ్చు.

అలా కాకుండా నిప్పు పెట్టిన వెంటనే అది దగ్గరకి కుంచించుకుపోతున్నట్లైతే అది సింథటిక్ బ్లెండెడ్ ఫ్యాబ్రిక్ అని చెప్పవచ్చు.

ఈ విధంగా మీరు కాటన్ ఫ్యాబ్రిక్ ప్యురిటీ చెక్ చేయడం సులభం కాబట్టి మీరు కూడా ఈసారి ఫ్యాబ్రిక్ ని ఈ విధంగా చెక్ చేసుకోండి.





Untitled Document
Advertisements