చలికాలంలో తరుచుగా ఉసిరి తింటే ఏం జరుగుతుందంటే?

     Written by : smtv Desk | Fri, Nov 17, 2023, 01:39 PM

చలికాలంలో తరుచుగా ఉసిరి తింటే ఏం జరుగుతుందంటే?

చలికాలంలో మనకు ఎక్కువగా లభించే ఉసిరికాయలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తాయి నే విషయం మీకు తెలుసా? చలికాలంలో మనకు తెలియకుండానే మనం అనేక రకాల ఇన్ఫెక్షన్ల బారిన పడుతుంటాము. అయితే మనం ఇటువంటి ఇన్ఫెక్షన్లకు గురవకుండా ఉండాలి అన్నా, అనేక రకాలా ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవాలంటే ఇమ్యూనిటీ మెరుగ్గా ఉండాలి.
అయితే, ఇమ్యునిటీ మెరుగ్గా ఉండాలి అంటే తీసుకునే ఆహారం విషయంలో జాగ్రత్త తప్పనిసరి. మనం ఇమ్యునిటీ కొరకు తీసుకునే కొన్ని ఆహారపదార్థాలలో ఉసిరి అత్యంత ముఖ్యమైనది. ఉసిరిలో పోషకాలు, ఔషధగుణాలు ఉంటాయి. ఇవన్నీ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఉసిరి తీసుకోవడం విషయంలో కొంతమందికి కొన్ని అపోహలు, భయాలు ఉంటాయి. అవన్నీ పోవాలి అంటే మీరు ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి.

* చలికాలంలో రెగ్యులర్‌గా జీర్ణ సమస్యలు వస్తాయి. అయితే, ఉసిరిలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. దీని వల్ల ప్రేగు కదలికలు సక్రమంగా జరిగి మలబద్దకం దూరమవుతుంది. జీర్ణ వ్యవస్థ నుండి టాక్సిన్స్ దూరమవుతాయి.
* ఉసిరిలో విటమిన్ సి, యాసిడ్ పాలిఫెనాల్స్, ఫ్లేవనయిడ్స్ సహా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ బాడీలో ఫ్రీ రాడికల్స్‌తో పోరాడతాయి. ఆక్సీకరణ ఒత్తిడి, వాపుని తగ్గించేందుకు ఉసిరి హెల్ప్ చేస్తుంది.
* ఉసిరిలో విటమిన్ సి కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల ఇమ్యూనిటీ పెరిగి అంటువ్యాధులు, అనారోగ్య సమస్యలు దూరమవుతాయి. దీనిని తీసుకుంటే తెల్ల రక్త కణాల ఉత్పత్తిని పెంచుతుంది. సాధారణ జలుబు, ఫ్లూ, సీజనల్ సమస్యల్ని దూరం చేయడంలో ఉసిరి హెల్ప్ చేస్తుంది.
* ఉసిరిలో ఒత్తిడిని దూరం చేసే గుణాలు ఉన్నాలు యి. చల్లని వాతావరణం, పర్యావరణ మార్పుల కారణంగా వచ్చే ఒత్తిడిని దూరం చేసి ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉసిరి బాగా పనిచేస్తుంది.
​* చలికాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. ఈ నేపథ్యంలోనే చర్మం, జుట్టుపై ఎఫెక్ట్ పడుతుంది. అయితే, ఉసిరిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది కొల్లాజెన్ ఉత్పత్తి పెంచుతుంది. చర్మాన్ని మెరుగ్గా చేస్తుంది. దీనిని మన డైట్‌లో చేర్చుకుంటే హెల్దీ స్కిన్ మీ సొంతమవుతుంది. చర్మ సమస్యల్ని దూరం చేయడంలో ఉసిరి బాగా పనిచేస్తుంది. దీంతో పాటు జుట్టు ఆరోగ్యాన్ని కాపాడి, చుండ్రుని దూరం చేస్తుంది.

చలికాలంలో ఉసిరి అలానే తినొచ్చు. లేదా సలాడ్, రసం రూపంలో కూడా తీసుకోవచ్చు. ఉసిరిని పచ్చడిలా, మురబ్బాలా కూడా చేయొచ్చు. దీని వల్ల ఇమ్యూనిటీ పెరగడం దగ్గర నుంచి ఆరోగ్యంగా ఉండడం, అందంగా కనివించడం వరకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మరి ఇన్ని ప్రయొజనాలు ఉన్న ఉసిరిని వెంటనే మీ ఆహారంలో భాగం చేసుకోండి.





Untitled Document
Advertisements