జుట్టు ఆరోగ్యానికి బాదం నూనెతో ఇలా చేయండి..

     Written by : smtv Desk | Tue, Dec 05, 2023, 04:27 PM

జుట్టు ఆరోగ్యానికి బాదం నూనెతో ఇలా చేయండి..

అందమైన తలకట్టు ఉంటే రంగు, రూపం కూడా కనిపించదు. అదే జుట్టు సరిగ్గా లేకపోతె మాత్రం ఎంత రంగున్నా అందంగా కనిపించడం కష్టమే. అయితే ప్రస్తుత కాలంలో కారణాలు ఏవైనా జుట్టు రాలిపోవడం అనే సమస్య ఎక్కువ మందిలో కనిపిస్తుంది. అటువంటి వారు హెయిర్ రిస్టోరేషన్ స్పెషలిస్ట్ స్కిన్ సర్జన్ డాక్టర్ సందీప్ చెప్పిన కొన్ని సహజ పద్ధతులను ప్రయత్నించి చూడండి. ఈ టిప్స్ వల్ల కొంతవరకైనా జుట్టు రాలే సమస్యను తగ్గించవచ్చు.
* హెయిర్ ఎయిర్ డ్రై వద్దు: జుట్టు త్వరగా ఆరాలని చాలామంది బ్లో డ్రైయర్, హట్ రోలర్లను ఉపయోగిస్తున్నారు. దీనివల్ల జుట్టు పెళుసుగా మారుతుంది. వీటిని అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే వాడండి. అదేపనిగా వాడితే జుట్టు పొడిబారిపోయి చింపిరిగా కనిపించవచ్చు.
* బలమైన జుట్టు కావాలంటే..: మీ తలకు సరిపడేంత బాదం నూనెను గిన్నెలో తీసుకుని కాసేపు వేడి చేయండి. చల్లారిన తర్వాత జుట్టుకు రాసుకుని నెమ్మదిగా మర్దనా చేయండి. అరగంట తర్వాత చల్లటి నీరు, షాంపూ, కండీషనర్‌తో శుభ్రం చేయండి.
* స్విమ్మింగ్ పూల్స్ దిగేప్పుడు..: స్విమ్మింగ్ పూల్‌లో ఎక్కువసేపు గడపడం కూడా జుట్టుకు హానికరమే. కాబట్టి.. ముందుగా జుట్టుకు కండీషనర్ రాసుకుని పూల్స్‌లోకి దిగండి.
* జుట్టును బిగించి కట్టొద్దు: జుట్టును చాలా సుకుమారంగా చూసుకోవాలి. దాన్ని ఇష్టానుసారంగా బిగించి కడితే.. కుదళ్లు వదులుగా మారిపోయి హెయిర్ ఫాల్ తీవ్రం అవుతుంది. వదులుగా వదిలేయడమే మంచిది.
* దువ్వేప్పుడు జాగ్రత్త: ఇటీవల ఎలక్ట్రికల్ కోంబ్స్ వాడేవారి సంఖ్య పెరిగింది. వీటికి దూరంగా ఉండటమే బెటర్. జుట్టు తడిగా ఉన్నప్పుడు అస్సలు దువ్వకూడదు. అలా చేస్తే కుచ్చులుగా ఊడిపోతుంది.
* గుడ్డుతో మీ జుట్టు గుడ్: మీ జుట్టు పొడిబారినట్లుగా అనిపిస్తున్నట్లయితే.. గుడ్డును ఉపయోగించి చూడండి. ఒక హాప్ కప్ నిండా గుడ్డులోని తెల్ల సొనను తీసుకుని జుట్టుకు రాసుకోండి. 20 నిమిషాల తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.
* జుట్టును శుభ్రంగా ఉంచుకోవాలి: చుండ్రు, దురద సమస్యల వల్ల జుట్టు ఎక్కువగా రాలుతుంది. కాబట్టి.. జుట్టును ఎప్పడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలి. దుమ్మూ, దూళి తగలకుండా జాగ్రత్త పడాలి. మురికి చేతులతో పట్టుకోకూడదు.
* వేడి నీటితో తలస్నానం: జుట్టు బాగా పెరగాలంటే చన్నీళ్ల కంటే వేడి నీరే ఉత్తమం. శరీర ఉష్ణోగ్రత కంటే కొద్దిగా వెచ్చగా ఉండే నీటితో తలంటుకోండి.
* జుట్టు బాగా మెరవాలంటే..: గోరు వెచ్చని నీటిలో ఆపిల్ సైడర్ వెనిగార్‌ను కలిపి జుట్టుకు రాయండి. 5 నిమిషాల తర్వాత తలను శుభ్రం చేసుకోండి.
* తరచుగా తలస్నానం చేయొద్దు: చాలామంది రోజూ తలపై నుంచి స్నానం చేస్తుంటారు. అది మంచి అలవాటు కాదు. వారంలో 2 లేదా 3 సార్లు చేయడమే ఉత్తమం. రోజూ తలస్నానం చేస్తే జుట్టు రాలే సమస్య పెరిగిపోవచ్చు.
* రసాయనాలు వద్దు.. మీరే కండీషనర్ తయారు చేసుకోండి: మార్కెట్లలో లభించే కండిషనర్లకు బదులు మీరే సహజ సిద్ధమైన కండీషనర్లు తయారు చేసుకోవచ్చు. గుడ్లు, పెరుగును బాగా కలిపి జుట్టు రాసి బాగా మర్దనా చేయండి. ఐదు నిమిషాల తర్వాత కడిగేయండి.
పైన చెప్పిన టిప్స్ ఫాలో అవడంతో పాటు మంచి ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.





Untitled Document
Advertisements