ఈ ఆసనాలు వేస్తే పొడవైన కురులు మీ సొంతం..

     Written by : smtv Desk | Tue, Jan 02, 2024, 04:36 PM

 ఈ ఆసనాలు వేస్తే పొడవైన కురులు మీ సొంతం..

ప్రస్తుతకాలంలో తలపై ఉండే జుట్టు తక్కువ నెలపై ఉండే జుట్టు శాతం ఎక్కువ అన్నట్టుగా ఉంది. మన అమ్మమ్మల కాలంలో జుట్టు దట్టంగా, పొడవుగా నిగనిగలాడుతూ ఉండేది. పైగా జుట్టు కూడా ఒక వయసు వచ్చే వరకు తెల్లబడేది కాదట. కానీ ప్రస్తుతం జుట్టు బుజాలు దాటడం లేదు. ఒత్తు అసలే లేదు. ఇక తెల్లజుట్టు చిన్న పిల్లలకు కూడా వచ్చేస్తుంది. జుట్టు సమస్యలకు అనేక కారణాలు ఉన్నాయి. అయితే వాటిలో ప్రధానంగా వత్తిడి, అసమతుల్యమైన ఆహారం, కాలుష్యం ఇలా కొన్ని ప్రధాన కారణాలు కలవు.
కారణం ఏదైనా కానీ జుట్టు రాలడమనేది వయసుతో సంబంధం లేకుండా దాదాపు అందరినీ వేధించే సమస్య. దాదాపుగా ప్రతి ఒక్కరూ నల్లని ఒత్తైన కేశాల కోసం ఎన్నో ప్రయోగాలు, ప్రయత్నాలు చేసినా పెద్దగా ఫలితం లేదు. అయితే ఖరీదైన ఉత్పత్తులు, గంటల పాటు సమయం వెచ్చించే అవసరం లేకుండా మీ జుట్టు ఊడకుండా ఉండేందుకు క్రమం తప్పకుండా రోజు అరగంట పాటు యోగా చేసినట్లైతే కొన్ని రోజుల్లోనే మీకు తేడా తెలుస్తుంది. అందులో భాగంగా కొన్ని యోగా ఆసనాలు చూద్దాం.

బాలాయం యోగ ముద్ర:- రెండు చేతుల గోర్లను ఒకదానికి ఒకటి రుద్దడాన్ని బాలాయం యోగ ముద్ర అంటారు. రోజు ఇలా చేయడం వల్ల జుట్టు ఊడడం తగ్గుతుంది. ఈ ప్రక్రియలో భాగంగా మన చేతి వేళ్ళను రుద్దినప్పుడు ఆ వేళ్ళ చివరనున్న మెదడుకి సంబంధించిన నరం దెబ్బతిని ఉన్న జుట్టు కుదుళ్లను పునరుద్ధరించమని మన మెదడుకి సంకేతం పంపిస్తుంది. అంతేకాకుండా ఈ ప్రక్రియ మనకి తలకి రక్తం సరఫరా చేయడానికి సహయపడుతుంది. అలాగే చుండ్రు, తెల్లజుట్టు సమస్యలను తగ్గిస్తుంది. ఈ ముద్రను వేసేటప్పుడు వజ్రాసనం, పద్మాసనం లేదా సుఖాసనంలో కూర్చుని బొటన వేళ్ళు మినహా మీ రెండు చేతుల గోర్లని ఒకదానికి ఒకటి తాకించి నెమ్మదిగా రుద్దాలి. ఇలా ప్రతిరోజూ ఐదు నుండి పది నిమిషాలు చేసినట్లైతే మీ జుట్టు రాలడం తగ్గుతుంది.

పాద హస్తాసన:- ఈ ఆసనం వేయడం కోసం రెండు కాళ్ళను దగ్గరగా చేసి నిలబడి రెండు చేతులను చెవులకు తగిలేలా తల పై వరుకు పట్టుకుని నెమ్మదిగా కిందకు వంగుతూ మీ రెండు అరచేతులను నేలను తాకించాలి కానీ గుర్తుంచుకోండి ఈ ఆసనం వేసినంత సేపు కూడా మీరు మీ మోకాళ్ళను వంచకూడదు. ఇలా కొన్ని సెకన్లు ఉండి మళ్లీ ముందు స్థానానికి చేరుకోండి. ఈ ఆసనాన్ని కొన్ని సార్లు చేయాల్సి ఉంటుంది. ఈ ఆసనం వేయడం వల్ల మీ తల భాగానికి రక్తం సరఫరా జరుగుతుంది. దానితో పాటు మీ జుట్టుకు ఆక్సిజన్ అందించడంలో ఈ ఆసనం చాలా బాగా పనిచేస్తుంది.

అధోముఖ స్వనాసనం:- దీనినే పర్వతాసనం అని కూడా అంటారు. ముందుగా యోగా మ్యాట్ మీద బార్ల పడుకోవాలి. మీ రెండు కాళ్ళను దగ్గరకి తెస్తూ మీ చేతులను మీ భుజాలకు సమాంతరంగా నిలపండి. నెమ్మదిగా మీ పై శరీర బరువుని మీ చేతుల మీద పడేలా చేస్తూ పైకి లేవండి. అటు పై మీ నడుము భాగాన్ని కూడా పైకెత్తండి. ఇప్పుడు మీ అరికాళ్ళను, అరచేతులను పూర్తిగా నేలకు ఆన్చి మీ నడుము భాగాన్ని స్ట్రెచ్ చేస్తూ మీ ఒంటిని పర్వత ఆకారంలోకి తీస్కురండి. ఇదే భంగిమలో కొన్ని సెకన్ల పాటు ఉండి మళ్ళీ యదాస్థానానికి వచ్చేయండి. క్రమం తప్పకుండా ఈ ఆసనాన్ని రోజు పలు మార్లు చేసినట్లైతే మీ జుట్టు పెరుగుదలకి చాలా మంచిది. ఇలా చేయడం వల్ల పైన చెప్పిన ఆసనాల్లానే మీ కుదుళ్లకు మెండుగా రక్త సరఫరా జరుగుతుంది.

మత్స్యాసనం:- ఈ ఆసనం కోసం మీరు ముందుగా వెల్లకిల్లా పడుకోవాలి. నెమ్మదిగా మీ కాళ్ళను దగ్గరకు లోపలి లాక్కుంటూ మీరు కూర్చున్నప్పుడు వేసే పద్మాసనం లేదా సుఖాసనంలోకి తెచ్చుకోవాలి. ఇప్పుడు మీ రెండు చేతులను మీ తొడల పై పెట్టీ రెండు మోచేతులను మీ నడుముకి ఇరు ప్రక్కలా నేలకు ఆంచండి. నెమ్మదిగా మీ పొట్ట భాగాన్ని పైకెత్తండి కానీ జాగ్రత్త మీ తల నేలను అనుకునే ఉండాలి. ఇలా కొన్ని నిమిషాల పాటు ఉండి యాదస్థానానికి వచ్చేయండి. మత్స్యాసనం వేయడం వల్ల మీ జుట్టు రాలడం తగ్గి జుట్టు పెరగడం మొదలెడుతుంది.

ఈ ఆసనాలు రోజు వేయడం అలవాటు చేసుకున్నట్లైతే మీ కేశాలు తప్పకుండా మునపటిలా పెరుగుతాయి.





Untitled Document
Advertisements