ఆన్‌లైన్‌లో 16 ఏళ్ల బాలికపై లైంగికదాడి.. ప్రపంచంలోనే మొదటి కేసు!

     Written by : smtv Desk | Wed, Jan 03, 2024, 11:36 AM

ఆన్‌లైన్‌లో 16 ఏళ్ల బాలికపై లైంగికదాడి.. ప్రపంచంలోనే మొదటి కేసు!

ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది ఆడపిల్లలు, మహిళలపై ప్రత్యక్షంగా అత్యాచారం జరగడం అనేది మనకు తెలిసిన విషయమే. అయితే ఆన్లైన్ లో ఓ బాలిక పై అత్యాచారం జరిగిన ఘటన ఆశ్చర్యానికి మరియు భయబ్రాంతులకు గురయ్యేలా చేస్తుంది. వివరాల్లోకి వెళితే ప్రపంచంలోనే తొలిసారి 16 ఏళ్ల యూకే బాలిక వర్చువల్‌గా అత్యాచారానికి గురైంది. ‘మెటావర్స్’ ద్వారా ఆన్‌లైన్‌లో జరిగిన ఈ ఘటనపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు దర్యాప్తు కోసం రంగంలోకి దిగారు. ఆన్‌లైన్ గేమ్‌లో తన అవతార్ (బాలిక డిజిటల్ కేరెక్టర్)పై గుర్తు తెలియని ఆన్‌లైన్ వ్యక్తులు సామూహిక లైంగికదాడికి పాల్పడినట్టు బాలిక ఆరోపించింది. ఈ ఘటన తర్వాత బాలిక తీవ్ర మనస్తాపానికి గురైంది.

బాలిక వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్ ధరించి ఆటలో లీనమై ఉన్న సమయంలో కొంతమంది యువకులు ఆమెపై సామూహిక అఘాయిత్యానికి పాల్పడినట్టు ఫిర్యాదులో పేర్కొంది. బాలిక శరీరంపై ఎలాంటి గాయలు లేనప్పటికీ వాస్తవ ప్రపంచంలో అత్యాచారం జరిగినట్టుగానే ఆమె వ్యవరిస్తోందని, ఆమె తీవ్రమైన మానసిక గాయాన్ని అనుభవిస్తున్నట్టు దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఇలాంటి కేసును పోలీసులు దర్యాప్తు చేయడం ప్రపంచంలోనే ఇది తొలిసారి. బాధిత బాలికకు అయిన మానసిక గాయం చాలాకాలం పాటు ఆమెను వెంటాడుతుందని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత చట్టంలో ఇటువంటి వాటికి సంబంధించి ఎలాంటి నిబంధన లేనందున దీనిపై పోలీసులు ముందుకు ఎలా వెళ్తారన్నది సర్వత్ర చర్చనీయాంశమైంది. కాగా, బాధిత బాలిక ఆ సమయంలో ఎలాంటి గేమ్ ఆడుతోందన్న విషయంలో స్పష్టత లేదు.
ఏది ఏమైనా పిల్లలు ఆన్లైన్ లో ఎటువంటి గేమ్స్ ఆడుతున్నాఋ అనే విషయం పై తలిదండ్రులు ఓ కన్నేసి ఉంచడం ఉత్తమం.





Untitled Document
Advertisements