ఫ్యాన్స్ చంప పగలగొట్టిన బాంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ షకీబ్ ..

     Written by : smtv Desk | Mon, Jan 08, 2024, 02:26 PM

ఫ్యాన్స్ చంప పగలగొట్టిన  బాంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ షకీబ్ ..

సెలబ్రీటీలకు అభిమానులు ఉండడం సర్వసాధారణం. ఆ అభిమానుల విషయంలో సెలబ్రీటీలు కూడా ఆచీతూచి వ్యవహరిస్తుంటారు అనే విషయం తెలిసిందే. అయితే అందుకు బిన్నంగా స్పందించారు ఓ సెలబ్రీటీ. తన అభిమాని చెంప ఛెళ్లుమనిపించిన బాంగ్లాదేశ్ క్రికెట్ కెప్టెన్ షకీబ్ అల్ హసన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాంగ్లాదేశ్ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసిన షకీబ్ ఒకటిన్నర లక్షల ఓట్ల తేడాతో ఘన విజయం సాధించారు. ఎన్నికల ఫలితాలు వెలువడటానికి కొన్ని గంటల ముందు వీడియో వెలుగులోకి వచ్చింది. ఎన్నికల పోలింగ్ రోజున ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. పోలింగ్ బూత్ లో ఓటు వేసిన వస్తున్న షకీబ్ ను అభిమానులు చుట్టుముట్టారు. ఓ అభిమాని ఆయనను వెనుక నుంచి పట్టుకునే ప్రయత్నం చేశాడు. దీంతో, సదరు అభిమాని చెంపను షకీబ్ ఛెళ్లుమనిపించారు. ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అధికార అవామీ లీగ్ పార్టీ తరపున షకీబ్ పోటీ చేశారు. ఆయన అభిమాని పట్ల స్పందించిన తీరుపై నేట్టిజన్లు మండిపడుతున్నారు.
https://twitter.com/doncricket_/status/1744181512008761853?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1744181512008761853%7Ctwgr%5Ef17eff6270e88e8e4b5268b9b43ae26a4993e5f6%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F791277%2Fbangladesh-cricket-star-shakib-al-hasan-slaps-fan





Untitled Document
Advertisements