పుట్టగొడుగులు క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి బెస్ట్ ఫుడ్

     Written by : smtv Desk | Sat, Jan 13, 2024, 01:58 PM

పుట్టగొడుగులు క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి బెస్ట్ ఫుడ్

నిత్యం మన చుట్టూ కనిపించే వ్యక్తులు రకరకాల అనారోగ్య సమస్యలతో బాధపడడం మనం చూస్తూనే ఉంటాము. ఒక్కొక్కరు ఒక్కో సమస్య తో భాదపడుతూ ఉంటారు. నిజానికి మన అనారోగ్యానికి కారణం మన ఆహారపు అలవాట్లు, మన జీవన విధానమే. ఈ మధ్య కాలంలో క్యాన్సర్ బారిన పడుతున్న వారి సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. క్యాన్సర్ బారిన పడిన వారికి పుట్టగొడుగులు మంచి ఆహారం అంటున్నారు ఆరోగ్య నిపుణులు. అయితే క్యాన్సర్‌ పేషెంట్స్‌ వారి డైట్‌లో పుట్టగొడుగుల ఎందుకు చేర్చుకోవాలో పుట్టగొడుగులు.. వీటిని వెజిటేరియన్స్‌ నాన్‌వెజ్‌ అని అంటారు. వెజిటేరియన్స్‌కు ప్రొటీన్‌ అందించే సూపర్‌ ఫుడ్‌‌. మష్రూమ్స్‌లో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇందులో విటమిన్-బి1, బి2, బి9, బి12, విటమిన్-సి, విటమిన్-డి2 ఉంటాయి. పుట్ట గొడుగుల్లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ-ఇన్‌ఫ్లమేటరీ గుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచేందుకు సహాయపడతాయి. క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందడానికి, క్యాన్సర్‌ ట్రీట్మెంట్‌ తీసుకునే వ్యక్తులు.. వారి డైట్‌లో పుట్టుగొడుగులు చేర్చుకోవడం మంచిది.

పుట్టగొడుగులలో బీటా-గ్లూకాన్స్ ఉంటాయి. ఇది రోగనిరోధక వ్యవస్థ ప్రతిస్పందనను మెరుగుపరచే.. పాలిసాకరైడ్. రోగనిరోధక వ్యవస్థను బలహీనపరిచే కీమోథెరపీ లేదా రేడియేషన్ వంటి చికిత్సలు చేయించుకుంటున్న క్యాన్సర్ రోగులకు, వారి ఆహారంలో పుట్టగొడుగులను చేర్చుకోవడం వారి శరీరం రక్షణ విధానాలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

యూంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి.. పుట్టగొడుగులలో సెలీనియం, విటమిన్ సి, వివిధ పాలీఫెనాల్స్‌తో సహా యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీర కణాలను దెబ్బతీసే, క్యాన్సర్‌ అభివృద్ధికి దోహదపడే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడతాయి. యాంటీఆక్సిడెంట్ రక్షణను అందించడం ద్వారా, పుట్టగొడుగులు క్యాన్సర్ చికిత్సలు, ఇతర కారకాల వల్ల కలిగే ఆక్సీకరణ ఒత్తిడి నుంచి ఆరోగ్యకరమైన కణాలను రక్షించడానికి సహాయపడతాయి. వీటిల్లో ఎర్గోథియోనీన్‌ అనే యాంటీఆక్సిడెంట్‌ దండిగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌ నివారణకు తోడ్పడుతుంది.

యాంటీఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి.. శరీరంలో దీర్ఘకాలిక మంట కారణంగా.. క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది, వ్యాధి కూడా పెరిగే ప్రమాదం ఉంది. పుట్టగొడుగలలోని రీషి, మైటేక్‌ వంటి రకాలకు సమ్మేళనాల్లో శోథ నిరోధక లక్షణాలు ఉంటాయి. మష్‌రూమ్స్‌లో ట్రైటర్పెనాయిడ్స్‌, పాలీశాకరైడ్స్ వంటి బయోయాక్టివ్‌ కాంపౌండ్స్‌ ఉంటాయి, ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి తోడ్పడతాయి. పుట్టగొడుగులు క్యాన్సర్ పెరుగుదలకు ప్రతికూల వాతావరణాన్ని సృష్టించగలవు.

ఒత్తిడిని తగ్గిస్తుంది.. రీషి, కార్డిసెప్స్‌ వంటి రకాల పుట్టగొడుగులను అడాప్టోజెన్‌లుగా పరిగణిస్తారు. అడాప్టోజెన్‌లు అనేవి శరీరం ఒత్తిడికి అనుగుణంగా, సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడే పదార్థాలు. క్యాన్సర్‌ చికిత్స సమయంలో శారీరక, మానసకి ఒత్తిడితో బాధపడే క్యాన్సర్‌ పేషెంట్స్‌ పుట్టగొడుగులు తీసుకుంటే మేలు జరుగుతుంది.

యాంజియోజెనిసిస్ అనేది కొత్త రక్త నాళాలు ఏర్పడే ప్రక్రియ, ఇది కణితుల పెరుగుదల, వ్యాప్తిలో కీలక పాత్ర పోషిస్తుంది. షిటేక్‌, మైటేక్ వంటి కొన్ని పుట్టగొడుగులు యాంజియోజెనిసిస్‌ను నిరోధించే వాటి సామర్థ్యంపై అధ్యయనం జరిపారు. పుట్టగొడుగులలోని కొన్ని సమ్మేళనాలు కణితులకు రక్త సరఫరాలో జోక్యం చేసుకుంటాయని, వాటి పెరుగుదల సామర్థ్యాన్ని పరిమితం చేస్తుందని ఈ పరిశోధనలు సూచిస్తున్నాయి.

పుట్టగొడుగుల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో విటమిన్-బి1, బి2, బి9, బి12, విటమిన్-సి, విటమిన్-డి2, సెలీనియం, కాపర్‌ వంటి పోషకాలు ఉంటాయి. ట్రీట్మెంట్‌ సైడ్‌ ఎఫెక్ట్స్‌, ఆకలి లేకపోవడం వంటి సవాళ్లను ఎదుర్కోవడానికి పుట్టగొడుగులు సహాయపడతాయి. ఇవి వారికి పోషకాలను అందించడానికి తోడ్పడతాయి.





Untitled Document
Advertisements