సెల్ పోన్ (హెల్ పోన్ )నుండి పిల్లలను మళ్ళించడం ఎలా ?

     Written by : smtv Desk | Mon, Jan 29, 2024, 08:23 AM

సెల్ పోన్ (హెల్ పోన్ )నుండి పిల్లలను మళ్ళించడం ఎలా ?

ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు ఎదురుకుంటున్న అతి పెద్ద సమస్య పిల్లలు ఫొన్ కి అడిక్ట్ అవడం. పిల్లలకు ఉన్న ఈ అలవాటుని మాన్పించలేక తల్లిదండ్రులు సతమతమవుతున్నారు .

అసలు పిల్లలు సెల్ పోన్ కి అడిక్ట్ అవ్వడానికి ముఖ్య కారణం ఒక రకంగా తల్లిదండ్రులే అని చెప్పొచ్చు.
వాళ్ళు పసి పిల్లలుగా ఉన్నప్పుడే వాళ్ళూ అన్నం తినడం కోసమో లేదంటే పెద్దవాళ్ళు పనులు చేసుకుంటుంటే డిస్ట్రబ్ చెయ్యకూడదనో ,నెలల పిల్లలకే పోన్ లను ఇచ్చేస్తుంటారు. అలా మనం వాళ్ళకి చిన్న వయసులోనే మనకి తెలియకుండా పోన్ లకి అడిక్ట్ అయ్యేలా చేస్తాం.
సహజం గా చిన్న పిల్లల్లో ప్రతిదీ తెలుసుకోవాలనే జిజ్ఞాస ఉంటుంది. వాళ్ళకున్న ఆ జిజ్ఞాస అరిచేతిలో కదిలే రంగురంగుల బొమ్మలని చూపే పోన్ కి ఎట్రాక్ట్ అయేల చేస్తుంది. అది నెమ్మదిగా వాళ్ళకి వ్యసనంగా మారుతుంది.
చివరికి సెల్ పోన్ కి ఎంతల అలవాటు పడతారు అంటే ,నిద్ర లేచింది మొదలు. తింటున్న , ఒంటరిగా ఉన్నా ,కుటుంబ సభ్యులా మధ్య ఉన్నా ,స్నేహితుల మధ్య ఉన్నా, ఎవరితో కలవకుండా వాళ్ళదైనా లోకంలో ఉంటారు ..
ఇలాంటి పిల్లలలో మార్పు తేవడానికి కొన్ని చిట్కాలు పాటించండి.

* పిల్లలకు అన్నం తినిపించేటప్పుడు వాళ్ళకి మీరే కబుర్లు చెప్పండి.

* రోజులో కొంత సమయం అయినా మీ పిల్లలతో గడపండి. వాళ్ళని తీసుకొని అలా సూపర్ మార్కెట్ కొ ,వెజిటేబుల్ మార్కెట్ కో వెళ్ళండి .

* పిల్లలని రీల్స్ లైప్ నుండి మళ్లించి ,రియల్ లైప్ చూపించండీ.

* వాళ్ళ పుట్టిన రోజు కానుకలుగా ఊహాజనితమైనా పాత్రల బొమ్మలు కాకుండా వాళ్ళ మనసు ,బుద్ది వికాసానికి ఉపయెగాపడే బొమ్మలను బహుమతులుగా ఇవ్వండి . ఉదా :- పజిల్ గేమ్స్ ,సుడోకో ,గ్రామర్ బుక్స్ ,చెస్ లాంటివి ..

* వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రతి తల్లిదండ్రులు కూడా పాటించాల్సింది వారు కూడా పిల్లల ముందు సెల్ పోన్ వాడకాన్ని తగ్గించడం. అవసరం ఉన్న మేర మాత్రమే వాడుతూ ..వీలైనంత వరకు పిల్లలతో టైమ్ స్పెండ్ చేయండి. వాళ్ళకి హోమ్ వర్క్ లో హెల్ప్ చేయండి.

* రోజులో కొంత సమయం మీరు ఏదొక పుస్తకం చదువుతూ మీ పిల్లలు కూడా చదివేల ప్రోత్సహించండి. మొదట మొండికేసినా ,మెల్లిగా అలవాటు పడతారు.

తద్వారా మీ పిల్లలు సెల్ పోన్ (హెల్ పోన్ )నుండి మళ్లించ బడతారు . ఈ మధ్య కాలంలో తలిదండ్రులు ఫోన్ ముట్టవద్దు అన్నారు అని కొంతమంది పిల్లలు మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకున్న ఘటనలు చోటుచేసుకున్న విషయం మనకు తెలిసిందే. అందుకే మీ పిల్లలు పూర్తిగా సెల్ అనే హెల్ లో పడిపోకముందే వారిని దాని నుండి మళ్ళించండి. మొక్కై వంగనిదే మానై వంగునా అన్నారు మన పెద్దలు అందుకే సమస్య ప్రారంభంలోనే దానిని దూరం చేసుకోవడం మంచిది. ఈ రోజే మీ పిల్లల చేతిలో నుండి సెల్ అనే హెల్ ని దూరంగా విసరడం ప్రారంభించండి.





Untitled Document
Advertisements