యువత ఎక్కువగా అనారోగ్యాల భారిన పడడానికి కారణం ఇదేనట !

     Written by : smtv Desk | Mon, Jan 29, 2024, 12:13 PM

యువత ఎక్కువగా అనారోగ్యాల భారిన పడడానికి కారణం ఇదేనట !

ప్రస్తుతం యువత పాతికేళ్ళకే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలతో భాధ పడుతున్నారు. మరి ఇలా చిన్న వయసులోనే వారిలో ఆరోగ్య సమస్యలు తలెత్తడానికి కారణం ఏంటని ఆలోచిస్తే " పోషకాహర " లోపం అన్ని చెబుతున్నారు ప్రముఖ నిపుణులు మరియు డాక్టర్లు. మరి ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోవాలి అంటే మనం ఏమి చేయాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం

అసలు పోషకాహారం అంటే ఏమిటి?
పోషకాహారం అంటే శరీరానికి అవసరమైన పోషకాలను అందించే ఆహరం. ఈ పోషకాలు శరీరానికి కావాల్సిన శక్తిని అందించడం, కణాలను పెంచడం , వ్యాధులను నిరోధించడం , ఇంకా మంచి ఆరోగ్యంను కాపాడుకోవడంలో సహాయపడతాయి.

పోషకాహారం ఎక్కువగా వేటిలో లభిస్తాయి?
ఈ పోషకాహారాలు ఎక్కువగా పిండి పదార్థాలు, మాంసకృత్తులు, క్రొవ్వు, శరీరానికి కావాల్సిన విటమిన్లు మరియు ఖానిజాల నుండి లభిస్తాయి. ఇటువంటి ఆహరం మనం నిత్యం తీసుకోవడం వలన శరీరానికి కావాల్సిన పోషక విలువలు పుష్కాలంగా లభిస్తాయి.

ఈ పోషకాలు మన శరీరానికి అందాలి అంటే రసాయనిక ఎరువులతో పండించేవి కాకుండా సేంద్రీయ పద్ధతిలో ఆర్గానిక్ గా పండించే ఆకుకూర్లు, కూరగాయలు, పండ్లను తీసుకోవడం మంచిది ఇంకా శ్రేష్టం. పోషకాహారంతో పాటు శారీరక శ్రమ అనేది కూడా కచ్చితంగా ఉండాలి. అందుకోసం యోగా, ఎక్సర్సైజులు, వాకింగ్ లేదా రన్నింగ్ లాంటి ఎంచుకోవడం మంచిది.






Untitled Document
Advertisements