సౌతాఫ్రికాకు రైనా..!

     Written by : smtv Desk | Sat, Feb 10, 2018, 03:56 PM

సౌతాఫ్రికాకు రైనా..!

ముంబయి, ఫిబ్రవరి 10 : దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ కోసం ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కించుకొన్న సురేష్ రైనా ఆదివారం దక్షిణాఫ్రికాకు బయలదేరనున్నాడు. గత ఏడాది చివరిలో యోయో పాసైన రైనా తాజాగా సఫారీలతో జరగనున్న మూడు టీ-20ల సిరీస్ కు ప్రకటించిన జట్టులో స్థానం సంపాదించుకున్నాడు.

ఈ నెల 18న సిరీస్ లో భాగంగా ఇరుజట్ల మధ్య తొలి టీ-20 జోహాన్స్ బర్గ్ వేదికగా జరగనుంది. భారత్‌ తరఫున రైనా చివరిసారిగా 2017 ఫిబ్రవరి 1న ఇంగ్లాండ్‌పై ఆడాడు. ఆ తర్వాత ఫిట్‌నెస్‌ సమస్యలు, యో యో టెస్టు పాసవ్వకపోవడం తదితర కారణాలతో ఏడాదిపాటు జట్టులో చోటు సంపాదించలేకపోయాడు.

Untitled Document
Advertisements