సెనగపిండి షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిదట..

     Written by : smtv Desk | Tue, Jan 30, 2024, 10:16 AM

సెనగపిండి షుగర్ వ్యాధిగ్రస్తులకు మంచిదట..

జిహ్వచాపల్యానికి బానిసలుగా మారితే రోగాల బారిన పడక తప్పదు అనే విషయం మన పెద్దలు తరుచుగా చెబుతూనే వుంటారు. మనం నోటికి రుచిగా ఉండాలి అనుకుని తినే పదార్థాల కారణంగా అనారోగ్య సమస్యలు తెచ్చుకుంటున్నాము. మనం తినే ఆహారంలో మన ఆరోగ్యానికి మంచి చేసేవి ఉన్నట్టే చెడు చేసేవి ఉన్నాయి. అందుకే రుచికి నాలుక చప్పరించకుండా ఆరోగ్యానికి మేలు చేసేవి తరుచుగా తినాలి. శరీరానికి ఎక్కువ మొత్తంలో పీచు పదార్థాలు అందించే గుణం ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం వల్ల ఆరోగ్యం బాగుంటుంది. అందుకే గోధుమ పిండి కి బదులుగా సెనగ పిండి ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

సెనగ పిండి తో చేసిన ఆహార పదార్థాలు తక్కువ తిన్న కూడా కడుపు నిండినట్లు అనిపిస్తుంది, తద్వారా ఆకలి తీరుతుంది. అలాగే సెనగ పిండితో తయారు చేసిన ఆహార పదార్థాల వల్ల శరీరంలో ఇన్సులిన్ మరియు రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంచుతుంది.
ఈ విషయం అధికారికంగా నిరూపితం అయిందని నిపుణులు చెబుతున్నారు. ప్రముఖ ఆరోగ్య సంస్థలు కూడా ఈ విషయాన్నిగుర్తించాయి. షుగర్ వ్యాధిని అదుపులో ఉంచడం మాత్రమే కాకుండా సెనగ పిండి అధిక బరువు సమస్యతో బాధపడుతున్న వారికి కూడా ఉపయోగం.

సెనగ పిండి కలిపి గోధుమ పిండి తో తయారు చేసిన ఆహార పదార్థాలను తినడం వల్ల పలు ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ప్రతి రోజూ తినే గోధుమ రొట్టెలో 40 నుండి 50 శాతం వరకు సెనగ పిండి ని కలపడం ద్వారా కచ్చితంగా మంచి ప్రయోజనాలను పొందవచ్చు. పలు అనారోగ్య సమస్యలకు చెక్ పెట్టే సెనగ పిండి ని ఇకపై రెగ్యులర్ గా వాడటం మంచిది అంటూ ఆయుర్వేద నిపుణులు మరియు పెద్ద వారు కూడా చెబుతున్నారు. సెనగపిండి తినడం మంచిదే అన్నారు కదా అని అదేపనిగా బజ్జీలు వేసుకుని తింటే ఒంట్లో కొవ్వు పేరుకోవడంతో పాటు గ్యాస్ ట్రబుల్ వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని మర్చిపోవద్దు సుమా..





Untitled Document
Advertisements