జపనీస్ అందానికి కారణం వారికున్న ఆ అలవాట్లేనట!

     Written by : smtv Desk | Wed, Jan 31, 2024, 04:50 PM

జపనీస్ అందానికి కారణం వారికున్న ఆ అలవాట్లేనట!

జపాన్ కు చెందిన వారిని ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా సులభంగా గుర్తించవచ్చు. అందుకు గల కారణం వాళ్ళ చర్మం మృదువుగా, ఆకర్షణీయంగా మరియు అందంగా ఉండడమే. ఎంతమందిలో ఉన్న ప్రత్యేకంగా కనిపించడం అనేది వీరికి ఉండే ప్లస్ పాయింట్.ముఖ్యంగా జపాన్ అమ్మాయిలు చాలా అందంగా ఉంటారు అనే టాక్ ప్రపంచ వ్యాప్తంగా ఉంది. జపాన్ లోని 99 శాతం మంది అమ్మాయిలు అందంగానే ఉండడానికి కారణం ఏంటో అంటూ చాలా మంది ఆశ్చర్యపోతూ ఉంటారు.

అసలు కారణమేంటంటే జపనీస్ సాంప్రదాయ ఆహారం కారణంగానే అమ్మాయిలంతా కూడా అందంగా ఉంటారట. వారి సాంప్రదాయ ఆహారంలో ఎక్కువ శాతం చేప నూనెను వినియోగిస్తూ ఉంటారు. చేప నూనె వినియోగించడం ద్వారా ఆరోగ్యంతో పాటు అందం కూడా దక్కుతుంది. ఇక వారు తినే ఆహార పదార్థాల్లో చక్కెర, ఉప్పు మరియు మాంసం చాలా తక్కువ పరిమాణంలో ఉంటుందట.
ఇక చివరిగా వారు తీసుకునే గ్రీన్ టీ అత్యంత ప్రయోజనకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ మూడు ఆహారపు అలవాట్ల వల్లే వారు అంత అందంగా కనిపిస్తున్నారని, అలాగే వారసత్వంగా వారికి అందం దక్కుతుందని నిపుణులు అంటున్నారు. ఇండియన్స్ లో కూడా ఎంతో మంది ఇలాంటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండడం వల్ల అందంగా కనిపిస్తున్నారు. అలాంటి ఆహారపు అలవాట్లు లేని వారు కూడా అందంగానే కనిపిస్తారు. కానీ అంతటి అందం కలిగి ఉండాలి అంటే మాత్రం కచ్చితంగా జపనీస్ వారి యొక్క సాంప్రదాయ ఆహారపు అలవాట్లను పాటించాల్సిందే. కాబట్టి అందం మరియు ఆరోగ్యం రెండు కావాలి అంటే ఆహారం విషయంలో కొద్దిపాటి మార్పు చేసుకుంటే సరి.





Untitled Document
Advertisements