ఉదయాన్నే ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే ఫిట్నెస్ మీ సొంతం

     Written by : smtv Desk | Thu, Feb 01, 2024, 09:21 AM

ఉదయాన్నే ఈ సూపర్ ఫుడ్స్ తీసుకుంటే ఫిట్నెస్ మీ సొంతం

వయసుతో సంబంధం లేకుండా ఎల్లప్పుడూ ఫిట్ గా ఉండాలి అనే తాపత్రయం దాదాపు చాలామందిలో ఉంటుంది. కానీ కొంతమంది అందుకు తగ్గ ప్రయత్నం అయితే అసలు చేయరు. కేవలం కోరిక ఉంటె చాలదు దానిని సాధించేందుకు పట్టుదల కూడా ఉండాలి. అయితే మీరు ఫిట్ గా ఉండాలి అంటే మీ రోజు ప్రారంభంలో కొన్ని మార్పులు చేసుకుంటే మీ కోరిక నెరవేరే అవకాశం ఉంటుంది. అవేంటో తెలుసుకోండి మరి..

మనం దాదాపు ప్రతి ఒక్కరు ఉదయం లేవడమే టీ, కాఫీలు తీసుకుంటారు. కానీ, వీటి బదులు పోషకాలు, ప్రోటీన్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోవడం మంచిది. వీటిని తీసుకోవడం వల్ల ఫిట్ గా కూడా ఉంటారు. ఇందుకోసం న్యూట్రిషనిస్ట్ ఇచ్చే కొన్ని సలహాల గురించి తెలుసుకుందాం.

* అరటిపండు అన్ని సీజన్లలో దొరికే పండ్లలో అరటిపండు ఒకటి. పొటాషియం, పీచు పదార్థం, విటమిన్ సి, విటమిన్ బి6, మెగ్నీషియం, ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి. వీటిని మీల్ తిన్నాక వీటిని తీసుకుంటే జీర్ణ సమస్యలు దూరమవుతాయి. షుగర్ క్రేవింగ్ కూడా తగ్గుతాయి.

* ఎండుద్రాక్షలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. నీటిలో నానబెట్టి తింటే మలబద్ధకం సమస్య దూరమవుతుంది. పేగు సమస్యలు తగ్గుతాయి. నిద్ర లేవగానే ఎండుద్రాక్షను తీసుకుంటే చాలా మంచిది.

* బాదంపప్పు పైపొట్టులో టానిన్ అనే టాక్సిన్ ఉంటుంది. ఇది శరీరంలోని ఇతర పోషకాల శోషణను కూడా తగ్గిస్తుంది. కాబట్టి, ఎప్పుడైనా బాదంపప్పుని నానబెట్టి తొక్కతీసి తినడం మంచిది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధకత, షుగర్, PCOS, నిద్ర సమస్యల్ని దూరం చేయడంలో హెల్ప్ చేస్తాయి.

* అదే విధంగా, ఉదయాన్నే టీ, కాఫీలు తాగే అలవాటు ఉన్నవారు పైన చెప్పిన ఫుడ్స్ లో ఏదైనా ఒకటి తీసుకున్నాక 20 నిమిషాల తర్వాత టీ, కాఫీలు తీసుకోవచ్చు.

* అన్నింటికన్నా ముందు ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చటి నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి. నీరు తాగిన తరువాతనే ఈ ఫుడ్స్ తీసుకోవాలి.

* థైరాయిడ్ ఉన్నవారు ఉదయం నిద్ర లేవగానే మందులు వేసుకున్నాక ఈ ఫుడ్స్ తీసుకోవాలి.
ఈ ఆహారాలను తిన్న 15, 20 నిమిషాల తర్వాత వర్కౌట్, యోగా చేయొచ్చు. తిన్న గంట తర్వాత మీరు బ్రేక్ ఫాస్ట్ తీసుకోవచ్చు.

* రాత్రి పడుకునే సమయంకన్నా మూడు గంటల ముందే మీ డిన్నర్ పూర్తి చేసుకోండి. డిన్నర్ పూర్తి చేసిన తరువాత ఓ అరగంటకు గ్లాస్ గోరువెచ్చని నీటిని తాగండి.





Untitled Document
Advertisements