చిరుధాన్యాలతో చిన్నారుల ఆరోగ్యానికి మరింత మేలు

     Written by : smtv Desk | Fri, Feb 02, 2024, 01:19 PM

చిరుధాన్యాలతో చిన్నారుల ఆరోగ్యానికి మరింత మేలు

కరోనా తరువాత ప్రతి ఒక్కరిలోనూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెరిగింది. అప్పటి వరకు ఆరోగ్యం పట్ల ఆహారం పట్ల శ్రద్దలేని వారంతా కూడా తమ ఆరోగ్యం గురించి ఆలోచించి తినే ఆహారపదార్థాల పై శ్రద్ధ చూపుతున్నారు. ఇదివరకు తిన్నట్టు బిర్యానీలు , బర్గర్లు కాకుండా ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే చిరు దాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు. చిరు దాన్యాలు తీసుకోవడం ఆరోగ్యానికి ఎంత మంచిది అనేది మన పూర్వీకులు నిండు నూరేళ్ళు ఎలాంటి అనారోగ్యం లేకుండా బ్రతికిన దానిని బట్టి మనం అర్ధం చేసుకోవచ్చు.

అయితే ఆ విషయం పక్కన పెడితే చిరు ధాన్యాలు పెద్ద వారికి మాత్రమేనా చిన్న పిల్లలకు కూడా ఉపయోగమా అంటూ కొందరిలో అనుమానం ఉంది. చిరు ధాన్యాలు ఎలాంటి అనుమానం లేకుండా పెద్ద వారితో పాటు చిన్న పిల్లలకు కూడా అద్భుతమైన ఆరోగ్య ఫలితాలను అందిస్తాయి అనడంలో సందేహం లేదు. అందుకే చిన్న పిల్లలకు కూడా డైట్ లో చిరు ధాన్యాలను వైధ్యులు సూచిస్తున్నారు. .
చిరు ధాన్యాలను పిల్లలకు నేరుగా ఇవ్వకుండా..
వాటిని నీటిలో కనీసం అయిదు నుండి ఆరు గంటల పాటు నానబెట్టాలి. ఆ తర్వాత వడగట్టి బుట్టలో మరో నాలుగు నుండి ఆరు గంటల పాటు ఉంచాలి. అప్పుడు చిరు ధాన్యాలు మొలక వస్తాయి. అలా మొలక వచ్చిన చిరు ధాన్యాలను నీడలో పూర్తిగా తేమ పోయేంత వరకు ఆరబెట్టుకోవాలి.
ఆరిన చిరు ధాన్యాల మొలకలను సన్నని వేడి పై లైట్ గా వేయించి వాటిని పొడి చేసుకోవాలి. ఆ పొడిని పిల్లలకు పాలల్లో ఇవ్వడం ద్వారా అద్భుతమైన ప్రయోజనాలు ఉంటాయి. డైరెక్ట్ గా చిరు ధాన్యాలు తీసుకోలేని పిల్లలు ఇలా పాల పొడి ద్వారా తాగడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి అంటూ వైధ్యులు చెబుతున్నారు. కనుక ఈ రోజు నుండి చిరు ధాన్యాలను ఆహారంలో భాగంగా చేసుకుని ఆరోగ్యంగా జీవించండి మరి.





Untitled Document
Advertisements