చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలకు ఈ ఇంటి చిట్కాలతో చెక్ !

     Written by : smtv Desk | Fri, Feb 02, 2024, 09:14 PM

చలికాలంలో వచ్చే జీర్ణ సమస్యలకు ఈ ఇంటి చిట్కాలతో చెక్ !

వాతావరణం చల్లగా ఉన్నప్పుడు మనకు చర్మ సమస్యలు మాత్రమె కాకుండా జీర్ణ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంది. అలాంటప్పుడు మనం తీస్కోవలసిన జాగ్రత్తలు ఏంటి అనేది తెలుసుకుందాం..

* కనుక సోంపు, జీలకర్ర, వాము వంటివి తినడంతో జీర్ణ సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
* వాతావరణం చల్లగా ఉన్నప్పుడు కొందరిలో ఆకలి తగ్గుతుందని అంటారు. అలాంటి వారు అల్లం ముక్కలను ఉప్పులో అది చప్పరిస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇంకా జలుబు మరియు ఇతర సమస్యలు కూడా వర్షాకాలం ఎక్కువగా బాధిస్తూ ఉంటాయి. అందుకే వేడి నీటిలో పసుపు వేసి ఆవిరి పట్టడంతో పాటు తులసి ఆకుల రసం మిరియాల పొడి తో కలిపి తీసుకోవడం మంచిది.
* హారతి కర్పూరం పొడిని కొబ్బరి నూనెలో వేసి కాచి చల్లార్చిన తర్వాత పిల్లల ఛాతి, ముక్కు, నుదురుపై రాస్తే పిల్లల్లో జలుబు తక్కువగా ఉంటుంది. ఇలా ముందస్తు చర్యలు తీసుకోకపోతే కచ్చితంగా ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సి ఉంటుంది. దాంతో జేబుకి చిల్లు పడటం ఖాయం.






Untitled Document
Advertisements