పొద్దున్నే ఫోన్ పట్టుకునే బదులు ఇలా చేస్తే మేలు జరుగుతుందట!

     Written by : smtv Desk | Sat, Feb 03, 2024, 08:17 AM

పొద్దున్నే ఫోన్ పట్టుకునే బదులు ఇలా చేస్తే మేలు జరుగుతుందట!

ఉదయం నిద్రలేవగానే ఫోన్ చూసే అలవాటు ఉంటె మానుకోండి దాని వాల్ల మనకు అనేక దుష్పలితాలు కలుగుతాయని పరిశోధనలు వెల్లడించాయి. బెడ్ పై కనీసం 10 నిమిషాల నుండి 40 నిమిషాల వరకు ఫోన్ చూస్తున్నట్లుగా ఒక సర్వేలో వెళ్లడి అయింది. ఉదయాన్నే ఫోన్ చూసే సమయంలో ఇప్పుడు నేను చెప్పే పనులు కనీసం సగం సమయం చేసినా కూడా మంచి ఆరోగ్యం మీ సొంతం.
ఉదయం లేచిన వెంటనే ఫోన్ చూడ్డానికి బదులు ఏదైనా పుస్తకం చదివితే మానసిక ప్రశాంతత ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉంటే శారీరకంగా కూడా ఆరోగ్యం లభిస్తుంది. కనుక ఉదయం కనీసం 20 నిమిషాలు బుక్ చదడం వల్ల ఆరోగ్యానికి మంచింది.
ఉదయం మెడిటేషన్ చేయడం ద్వారా కూడా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అనేక విధాలుగా ప్రశాంతత లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఇంకా యోగా చేయడం కూడా ఆరోగ్యానికి మంచిది. యోగాను కనీసం 20 నిమిషాలు చేస్తే చాలని నిపుణులు కూడా చెబుతున్నారు. కనుక ఫోన్ చూసే సమయంలో యోగా చేస్తే ప్రయోజనాలు మెండుగా ఉన్నాయి. వాకింగ్ చేయడం ద్వారా కూడా ఆరోగ్యం ను కాపాడుకోవచ్చు. ఉదయం ఫోన్ చూసే 30 నిమిషాల్లో కనీసం 15 నిమిషాలు వాకింగ్ చేయడం ద్వారా ప్రయోజనాలు చాలా పొందవచ్చు.
ఉదయం ఫోన్ లో ఎక్కువ సమయం గడపడం కంటే న్యూస్ పేపర్ ను తిప్పేయడం ద్వారా ఎన్నో విషయాలు తెలుస్తాయి.





Untitled Document
Advertisements