టీ లో నిమ్మరసం కలపడం మంచిదేనా?

     Written by : smtv Desk | Sat, Feb 03, 2024, 09:05 AM

టీ లో నిమ్మరసం కలపడం మంచిదేనా?

ఉదయం నిద్రలేవగానే టీ తాగే అలవాటు మనలో చాలామందికి ఉంటుంది. అయితే టీ తాగే ప్రతి ఒక్కరు ఈ విషయాలను గమనించుకోవాలి.
టీ ఎలా తాగిన పర్వాలేదు కానీ ఈ పదార్థాలతో కలిపి మాత్రం తాగకూడదు.. అలాగే టీ తాగిన తర్వాత కనీసం అర్థగంట లేదా గంట తర్వాత మాత్రమే ఇప్పుడు నేను చెప్పబోయే పదార్థాలను తీసుకోవాలి.
మొదటగా టీ లో నిమ్మరసం వాడకూడదు. వేడి టీ లో నిమ్మరసం కలిపి తీసుకుంటే ఆ టీ కాస్త ఆమ్లంగా మారుతుంది.
అది జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. టీ తాగిన వెంటనే ఏవైనా పండ్లు తినడం మంచిది కాదు. కనీసం గంట గ్యాప్ ఉండేలా చూసుకుంటే బెటర్.
టీ తో పాటు పెరుగు తీసుకోవడం లేదా టీ తాగిన వెంటనే పెరుగు తినడం వల్ల అజీర్తి సమస్య తలెత్తే అవకాశం ఉంది. వేడి టీ తాగిన వెంటనే చల్లటి ఐస్ క్రీమ్ తినకూడదు. అలా చేస్తే గొంతు సమస్యలు వచ్చే అవకాశం ఉంది అంటూ నిపుణులు చెబుతున్నారు.





Untitled Document
Advertisements