ఆదివారం స్పెషల్ అదిరిపోయే చికెన్ ఫ్రై రేసీపీ

     Written by : smtv Desk | Sun, Feb 04, 2024, 08:08 AM

ఆదివారం స్పెషల్ అదిరిపోయే చికెన్ ఫ్రై  రేసీపీ

ఆదివారం వచ్చింది అంటే చాలు ప్రతి ఇంట్లోనూ దాదాపు తప్పకుండా నాన్వెజ్ వండుతారు. ఆదివారం ఇంట్లో ఉండే అందరికి హాలిడే కాబట్టి కమ్మగా తినాలి అనుకుంటారు. ఇంట్లోని అందరికి సెలవుదినం అయినా ఇంటి ఇల్లాలికి మాత్రం పనిచేయక తప్పదు. ఇంట్లో అందరికి నచ్చేట్టుగా వండి వడ్డించాలి. అయితే మెజారిటీ పీపుల్ చికెన్ ఫ్రై తినడానికి ఇష్టపడతారు. అందుకే చికెన్ ఫ్రై రేసీపి మీకోసం..


చికెన్ ఫ్రై కొరకు కావాల్సిన పదార్థాలు..
చికెన్ - అర కేజీ
నూనె - సరిపడా
అల్లం వెల్లుల్లి పేస్ట్ - మూడు స్పూన్లు
ఉప్పు - తగినంత
ధనియాలు - రెండు స్పూన్లు
మిరియాలు - అర టీ స్పూన్
ఎండుమిర్చి - ఆరు
ఉల్లిపాయలు - 4
టమాటాలు - రెండు
కొత్తిమీర - ఒక కట్ట
కరివేపాకు - కొద్దిగా
అనాసపువ్వు - ఒకటి
మరాఠీ మొగ్గ - ఒకటి
జీలకర్ర - 1/2 టీ స్పూన్

తయారు చేసే విధానం: ముందుగా చికెన్ కడిగి అందులో ఉప్పు,పసుపు వేసి కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు అన్నిటిని తీసుకుని కొద్దిగా ఫ్రై చేసి మిక్సిలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి . పేస్ట్ నూ రెండు సగాలు చేసి పెట్టుకుని ఒక సగం చికెన్ లో వేసుకుని కుక్కర్ ఉడికించుకోవాలి . ఇప్పుడు పొయ్యి వెలిగించుకుని ఒక కాడాయి పెట్టుకోవాలి. అది వేడెక్కిన తరువాత నూనే వేసి వేడెక్కిన తరువాత చికెన్ ముక్కల్నివేయించి తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి.అదే పాన్ లో ఉల్లిపాయముక్కలు,అల్లంవెల్లుల్లి పేస్ట్,మిగిలిన మసాలా పేస్ట్ వేసి వేయించుకుని ఐదు నిముషాలు వేగాక టమాటా ముక్కలు కూడా వేసి కొంచం మగ్గనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై గా అయ్యేవరకు వేయించి కరివేపాకు కొత్తిమీరతో అలంకరించుకోవాలి. అంతే ఎంతో రుచికరమైన వేడి వేడి చికెన్ ఫ్రై తినడానికి సిద్దం. ఈ ఫ్రై అన్నంలోకి, చపాతీ లేదా పూరిలోకి చాలా టేస్టీగా ఉంటుంది.





Untitled Document
Advertisements