ఇంగ్లండ్‌ టెస్టుకు రవిచంద్రన్ అశ్విన్ దూరం,, కారణం అదేనట !

     Written by : smtv Desk | Sat, Feb 17, 2024, 09:05 AM

ఇంగ్లండ్‌ టెస్టుకు రవిచంద్రన్ అశ్విన్ దూరం,, కారణం అదేనట !

ప్రస్తుతం టీమిండియా జట్టు ఇంగ్లండ్‌ వేదికగా టెస్ట్ సీరీస్ లలో పాల్గొంటున్న విషయం తెలిసిందే. అయితే ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టు నుంచి భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అకస్మాత్తుగా తప్పుకున్నాడు. కుటుంబంలో మెడికల్ ఎమర్జెన్సీ కారణంగా అశ్విన్ తప్పుకున్నట్టు బీసీసీఐ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపింది.

రాజ్‌కోట్‌లో జరుగుతున్న మూడో టెస్టులో ఓ వికెట్ తీసిన అతడు 500 వికెట్ల క్లబ్‌లో చేరాడు. అనిల్ కూంబ్లే తరువాత ఈ ఘనత సాధించిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. దీంతో, ప్రధాని మోదీ కూడా రవిచంద్రన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆ తరువాత కొన్ని గంటలకే రవిచంద్రన్ ఆట నుంచి తప్పుకోవాల్సి వచ్చింది.

అయితే, తల్లి అనారోగ్యం కారణంగానే రవిచంద్రన్ మ్యాచ్‌కు దూరమైనట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. ఈ పరిస్థితుల్లో తల్లికి దగ్గరగా ఉండేందుకు రవిచంద్రన్ చెన్నై వెళుతున్నట్టు తెలిపారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఈ క్లిష్ట పరిస్థితుల్లో అతడికి తాము అండగా ఉంటామని బీసీసీఐ తెలిపింది. క్రికెటర్ల ఆరోగ్యం, వారి క్షేమమే తమకు అత్యంత ముఖ్యమని వ్యాఖ్యానించింది. ఈ సమయంలో రవిచంద్రన్, అతడి కుటుంబం గోప్యతను గౌరవించాలని కోరింది. రవిచంద్రన్‌కు ఏ సాయం కావాలన్న చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామంటూ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది.





Untitled Document
Advertisements