ఆ యువ క్రికెటర్ ను ధోనీతో పోల్చిన గవాస్కర్

     Written by : smtv Desk | Mon, Feb 26, 2024, 07:47 AM

ఆ యువ క్రికెటర్ ను  ధోనీతో పోల్చిన  గవాస్కర్

ప్రస్తుతం టీమిండియ జట్టులోకి అడుగుపెట్టిన ఆటగాళ్ళు తమ ఆటతీరుతో అందరి దృష్టిని ఆకర్షిస్తూ తమ సత్తా చాటుతున్నారు. తాజగా రాంచీ టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ ధ్రువ్ జురెల్ 90 పరుగులతో చక్కని బ్యాటింగ్ ప్రదర్శన చేశాడు. టాపార్డార్ విఫలమైన చోట ధ్రువ్ జురెల్ అద్భుతంగా ఆడి టీమిండియా ఇన్నింగ్స్ ను నడిపించాడు. తొలి ఇన్నింగ్స్ లో టాప్ స్కోరర్ గా నిలిచాడు.

దీనిపై భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ స్పందించారు. ధ్రువ్ జురెల్ ఆడిన తీరు ఎంతో సమయోచితంగా ఉందని, పరిస్థితులకు తగ్గట్టుగా బుర్ర ఉపయోగించి ఆడాడని కితాబిచ్చారు. జురెల్ ను చూస్తుంటే మరో ధోనీ తయారవుతున్నట్టుగా అనిపిస్తోందని అన్నారు. ఇవాళ రాంచీలో ఆడినట్టే ఆడితే మున్ముందు జురెల్ ఎన్నో సెంచరీలు సాధిస్తాడని, అతడికి పరిస్థితులను అర్థం చేసుకుని చేసుకుని ఆడడం ఎలాగో తెలుసని కితాబిచ్చారు.

23 ఏళ్ల జురెల్ కు ఇది రెండో టెస్టు మాత్రమే. రాజ్ కోట్ టెస్టుతో ఆరంగేట్రం చేసిన ఈ యువ వికెట్ కీపర్ టీమిండియాకు భవిష్యత్ ఆశాకిరణంలా కనిపిస్తున్నాడని ఇతర మాజీ క్రికెటర్ లు సైతం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.





Untitled Document
Advertisements