ఆవులు పిడకలతో ఇలా చేస్తే బోలెడు సంపాదన!

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 12:16 PM

ఆవులు పిడకలతో ఇలా చేస్తే బోలెడు సంపాదన!

మన హైందవ సంస్కృతి సంప్రదాయాలలో భాగంగా ఉదయాన్నే ఇంట్లో పూజచేసి ఇల్లంతా ధూపం వేయడం మనకు అలవాటు. పూజలు,యజ్ఞాలు, నోములు వంటివి ఉన్నప్పుడు మనము ఆవు పిడకలు వాడవలసి ఉంటుంది .దీని వలన ఈ మధ్య కాలంలో ఆవు పిడకలకు డిమాండ్ ఉంది . ఇది దృష్టిలో పెట్టుకొని ఇటీవల పాముల గ్రామానికి చెందిన రామాచారి గోమూత్రం, ఆవు విసర్జించిన పేడ ద్వారా వ్యాపారం నిర్వహిస్తూ తనదైన శైలిలో ఉపాధి పొందుతున్నాడు .
తన దగ్గర రెండు ఆవుల ద్వారా ప్రతిరోజు వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నానని చెప్పారు. అది ఎలాగంటే ఒక్క ఆవు నాలుగు లీటర్లు ఇస్తుంది…. రెండు ఆవుల ద్వారా ఎనిమిది లీటర్ల పాలు ప్రతిరోజు పాల కేంద్రానికి తరలిస్తున్నట్లు తెలిపారు. కేంద్రం దగ్గర పాలలో ఉన్న కొవ్వు శాతం ద్వారా రేటు నిర్ధారిస్తారు.

లీటర్ వచ్చేసి 40, 50 రూపాయలు దాకా వస్తున్నాయని చెప్తున్నారు. అదేవిధంగా ఆవు విసర్జించిన పిడకల ద్వారా ఒక్క పిడక కు వచ్చేసి 5 రూపాయలు చొప్పున హైదరాబాద్ కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఆవు మూత్రం లీటర్ 30 రూపాయలు చొప్పు న అముతున్నారు . దేశీయ ఆవు నెయ్యి 3000 రూపాయలు కేజీ చొప్పున విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నానన్నారు .

ప్రస్తుతం వ్యాపారం బాగా జరుగుతుందన్నారు. నూతనంగా ఈ వ్యాపారం చేయాలనుకున్న వారికి ఓ గోమాత సేవతో పాటు ఉపాధి పొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రతిరోజు వెయ్యి రూపాయల లేదా అంతకంటే ఎక్కువ కూడా సంపాదించవచ్చన్నారు . ఆలోచిస్తే ఉపాధి కొరకు ఏదో ఒక ఉపాయం దొరుకుతుందని అంటుంటారు పెద్దలు. తెలివితేటలతో ఎలా అయినా ఉపాధి పొందవచ్చని నిరూపించారు ఓ యువకుడు. ఆవుల ద్వారా వచ్చిన గోమూత్రం అలాగే విసర్జించిన పేడ నుండి తనదైన శైలిలో వ్యాపారం చేస్తున్నారు . ఈ వ్యాపారం ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరికొన్ని దేశీ ఆవులు తీసుకొచ్చి పెంచాలని భావిస్తున్నానన్నారు. అంతే కాకుండా ఆవుకు సేవ చేసుకునే అదృష్టం కూడా దొరుకుతుంది .





Untitled Document
Advertisements