ఇంట్లో మొక్కలు పెంచుకునే వారి కోసమే ఈ టిప్స్..

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 02:12 PM

ఇంట్లో మొక్కలు పెంచుకునే వారి కోసమే ఈ టిప్స్..

మనలో చాల మందికి ఇంట్లో మొక్కలను పెంచుకునే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉన్నవారు వాటి పట్ల కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాల అవసరం . కేవలము వాటర్ మాత్రమే పోసి వదిలివేయకుడదు . చెట్లు బాగా పెరిగేందుకు చాలా మంది బయట ఎరువులు వాడుతూ ఉంటారు. వాటికి బదులు ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించుకొని వాటిని మంచిగా పెంచుకోవచ్చు.

ఇంటి చిట్కాలు పాటించడం వల్ల చెట్లు బాగా పెరగడమే కాకుండా మాడకుండా ఉంటాయి. ఎరువులు ఎక్కువగా వాడటం వల్ల చెట్లు త్వరగా చనిపోయే అకాశాలు ఎక్కువగా ఉంటాయి.వీటి కోసం కాఫీ గ్రౌండ్స్ చక్కగా ఉపయోగ పడతాయి. అలాగే వాడి పారేసిన టీ పౌడౌర్స్, కాఫీ పొడి కూడా వేయవచ్చు. దీని వల్ల నైట్రోజెన్ నేల నిర్మాణాన్ని మెరుగ్గా చేసి చెట్ల ఎదుగుదలకు చక్కగా సహాయ పడతాయి.

వెనిగర్‌తో కూడా మొక్కలు బాగా పెరుగుతాయి. వెనిగర్‌లో ఉండే ప్రత్యేకమైన గుణాలు . సూక్ష్మ క్రిములను చంపుతాయి. అలాగే ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటాయి. ఇది వాటర్‌లో కలిపి చెట్లకు స్ప్రై చేయడం వల్ల ఫంగల్ వ్యాధులు దరిరావు.అంతే కాకుండా మన కిచెన్ లో వాడే బేకింగ్ సోడాను మొక్కలకు ఉపయోగించడం వల్ల బూజు, నల్ల మచ్చలు వంటి శిలీంధ్రాల సమస్యల తగ్గుతుంది. కొద్దిగా బేకింగ్ సోడాను వారానికి ఒక సారైనా.. మొక్కలపై స్ప్రే చేస్తూ ఉంటే ఫంగస్ వంటివి దూరంగా ఉంటాయి. ఈ విధంగా మన కిచెన్ లో దొరికే ఐటమ్స్ ఉపయోగించుకొని మొక్కలకు కావలసిన ఎరువులను తయారు చేసుకోవచ్చును . వీటి వలన ఎలాంటి నష్టం కూడా ఉండదు .





Untitled Document
Advertisements