బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయాలి..

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 02:32 PM

బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండాలంటే ఇలా చేయాలి..

సాధారణంగా చాల మంది ఒక సంవత్సర కాలానికి సరిపడే బియ్యాన్ని తక్కువ రేట్ ఉన్నపుడు కోని పెట్టుకుంటారు . అయితే కొంత కాలం తర్వాత వాటికీ పురుగులు పడతాయి దాని వలన చాల ఇబ్బందిగా ఉంటుంది.
బియ్యానికి పురుగులు ఎందుకు పడతాయి?
నిల్వ చేసిన ధాన్యాలకు సాధారణంగా నుసి పురుగులు, ముక్కు పురుగులు, లద్ది పురుగులు పడుతూ ఉంటాయని తెలుస్తుంది .
ఈ పురుగులు ధాన్యం గింజలను గుల్ల చేస్తాయి, ధాన్యానికి రంధ్రం చేసి, పొడి చేస్తాయి. ఇలా పొడిగా అయిన బియ్యాన్ని శుభ్రం చేయడం కాస్త కష్టమే అవుతుంది. పైగా పురుగులు పట్టిన బియ్యాన్ని శుభ్రం చేసుకుని తినడం వల్ల జీర్ణ సంబంధిత వ్యాధులు వస్తాయి .
సిరిధాన్యాలతో పోల్చి చూసినపుడు వరి, గోధుమలకు పీచు పదార్థం ఉన్న కవచం తక్కువగా ఉంటుంది. దీని కారణంగానే వరి, గోధుమలు నిల్వ చేసినపుడు పురుగులు ఎక్కువగా పడతాయని తెలుస్తుంది .

బియ్యానికి పురుగులు పట్టకుండా ఏం చేయాలి?
పురుగుల సమస్యను ఎదుర్కోవడానికి నిపుణులు కొన్ని చిట్కాలను సూచిస్తున్నారు. ముందుగా బియ్యం నిల్వ ఉంచిన డబ్బాలోకానీ, దాని చుట్టూ కానీ తేమ లేకుండా చూసుకోవాలి. తేమ కారణంగా పురుగులు పడతాయని తెలుస్తుంది .

బియ్యం నిల్వ ఉంచే డబ్బాల్లో ఘాటైన వాసన ఉండే పదార్థాలు వేయడం వల్ల పురుగులు చేరకుండా ఉంటాయని ఇంకొందరు నిపుణులు చెబుతున్నారు. అలాంటి వాటిలో వేపాకు, బిరియానీ ఆకు, లవంగాలు, ఇంగువ, కర్పూరం, వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, రాతి ఉప్పు వంటి పదార్థాలున్నాయి. వీటి సాయంతో బియ్యంలో పురుగులు రాకుండా చేయవచ్చు.

అలానే వేపాకు, లవంగాలు, కర్పూరాన్ని పొడిగా చేసి ఒక గుడ్డలో కట్టి బియ్యం డబ్బాలో వేసినా, వాటి వాసనకు పురుగులు పట్టకుండా ఉంటాయని డాక్టర్ టీ ఇందిర చెప్పారు.

‘’వేపాకు, లవంగాలకు క్రిమికీటకాలతో పోరాడే శక్తి ఉంటుంది. అలానే వాటి ఘాటైన వాసన కారణంగా బియ్యానికి పురుగు పట్టకుండా ఉంటుంది. కొందరు బోరిక్ పౌడర్‌ను కూడా గుడ్డలో కట్టి బియ్యం నిల్వ చేసే డబ్బాల్లో వేస్తారు. అయితే బియ్యానికి పురుగులు పట్టకుండా ఉండేలా మార్కెట్‌లో కొన్ని కెమికల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి’’ అని డాక్టర్ టీ ఇందిర అన్నారు.

‘అందరూ బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత నీటిలో ఉడకబెట్టి తింటారు. కాబట్టి ఆ వేడికి బియ్యంలో ఏవైనా కీటకాల మలినాలున్నా, బ్యాక్టీరియా ఉన్నా చనిపోతాయి. కాబట్టి ఆరోగ్యంపైన పెద్దగా ప్రభావం చూపదు. అజీర్ణ సమస్యల తీవ్రత కూడా తక్కువగానే ఉంటుంది

పాతకాలంలో గ్రామీణ ప్రాంతాల్లోని ఉమ్మడి కుటుంబాలు ఎక్కువ మొత్తంలో బియ్యాన్ని దీర్ఘకాలం నిల్వ చేసుకునేవి. కానీ ప్రస్తుతం చిన్న కుటుంబాలే ఎక్కువ. వీళ్లు తక్కువ మోతాదులోనే బియ్యాన్ని నిల్వ చేసుకుంటున్నారు. బియ్యానికి పురుగులు, కీటకాలు పట్టిన కారణంగా జబ్బు బారిన పడ్డ వాళ్లు చాలా తక్కువ అని తెలుస్తుంది .
బియ్యానికి పురుగులు పట్టకుండా ఈ మధ్య బోరిక్ పౌడర్, ఆముదం నూనె వంటి వాటిని కూడా బియ్యం డబ్బాల్లో ఉంచుతున్నారని తెలుస్తుంది . దీని కంటే మనకు కావలసిన కొద్దీ తెచ్చుకొని వాడుకోవడం చాల మంచిది . అలాంటి అప్పుడు ఇలాంటి సమస్యలు ఏవి కూడా రాకుండా ఉంటాయి .





Untitled Document
Advertisements