పెరుగులో ఈ పండు కలిపి రాస్తే ముఖం మెరిసిపోవడం కాయం!

     Written by : smtv Desk | Mon, Mar 18, 2024, 03:30 PM

పెరుగులో ఈ పండు కలిపి రాస్తే ముఖం మెరిసిపోవడం కాయం!

ఆడవారికి అందం అంటే దేవుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు . ఆ అందాన్ని కాపాడుకోవడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది . దాని కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. ఫేస్ క్రీమ్స్, ఫేషియల్స్ లాంటివి ట్రై చేస్తారు. అయితే, అలా డబ్బు ఖర్చు లేకుండా ఇంట్లోనే కొన్ని ఫేస్ ‌ప్యాక్స్ ట్రై చేయొచ్చు. అలాంటి ఓ ఫేస్ ప్యాక్ గురించి తెలుసుకోండి. ఈ ఫేస్ ప్యాక్‌కి 3 పదార్థాలు సరిపోతాయి.

కావాల్సిన పదార్థాలు:
దీనికి మొత్తం మూడు పదార్థాలు కావాలి. అవి పెరుగు, నారింజ తొక్కల పొడి, కలబంద. పెరుగు ఆరోగ్యానికే కాదు. అందానికి కూడా మంచివి. చర్మాన్ని కాంతివంతంగా, మృదువుగా మారుస్తాయి. చర్మంపై ముడతల్ని తొలగిస్తుంది. ఇందులోని లాక్టిక్ యాసిడ్ బ్లీచింగ్
ఉండడం వలన ఏజెంట్‌లా పనిచేస్తుంది.
నారింజ పండు ఆరోగ్యానికే కాదు ముఖానికి కూడా మంచిదే . దీని తొక్కల్లోనూ ఎన్నో అద్భుత గుణాలు ఉన్నాయి. ఇందులో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి, చర్మానికి ఎన్నో ప్రయోజనాలు అందించి స్కిన్ టోన్‌ని పెంచి మృదువుగా మారుస్తుంది.
ముందుగా ఆరెంజ్ తొక్కను ఎండబెట్టి పొడి చేయండి. ఈ పొడి కూడా అందుబాటులో ఉంటుంది. అయితే స్వచ్ఛమైన పొడిని మాత్రమే తీసుకోండి. పెరుగులో తగినంత ఆరెంజ్ పౌడర్, మన ఇంట్లో అలోవెరా మొక్క ఉంటే ఫ్రెష్ గా జెల్ ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చును . లేదు అంటే మార్కెట్ లో దొరికే అలోవెరా జెల్, ఈ మూడింటిని మిక్స్ చేసి పేస్టులా చేయండి. దీనిని ముఖానికి అప్లై చేసి 20 నిమిషాల తర్వాత క్లీన్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే ముఖం కాంతివంతంగా మారుతుంది.
కొన్నిసార్లు ముఖం డల్‌గా, నిర్జీవంగా కనిపిస్తుంది. అలాంటప్పుడు ఇంట్లోనే చేసుకున్న ఈ ఫేస్‌ప్యాక్ ను వాడుకొని చిటికెలో అందంగా తయారు అవ్వొచ్చు.





Untitled Document
Advertisements